Fake Currency: భారీగా నకిలీ నోట్లు సీజ్.. 12 మంది అరెస్ట్.. ఇద్దరి పరారీ
Fake Currency: తీగ లాగితే డొంక అంత కదిలినట్టు దొంగ నోట్ల ముఠా గుట్టంతా రట్టైంది. లక్షేట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కానుగంటి. క్రాంతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాసతో దొంగ..

Fake Currency: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట లో కలకలం రేపిన దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. లోతుగా దర్యాప్తు చేపట్టి పక్కా ఆదారాలతో 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిదిలో గత వారం రోజులుగా మార్కెట్ లో దొంగ నోట్ల చలామణి కలకలం రేపింది. ఈనెల 25న లక్షేట్టిపేట ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఏకంగా ఒకే నెంబర్ ఉన్న మూడు 5 వందల నకిలీ నోట్ల ను గుర్తించారు పెట్రోల్ బంక్ సిబ్బంది. కారులో వచ్చిన నిందితులు 1500 రూపాయల డిజీల్ పోయించుకుని నకిలీ నోట్లు ఇచ్చి జంప్ అయ్యారు. ఆలస్యంగా గుర్తించిమ పెట్రోల్ బంక్ సిబ్బంది.. బంక్ యజమానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన పెట్రోల్ బంక్ యజమాని సత్యనారాయణ లక్షేట్టిపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ బంక్ లోని సీసీ పుటేజ్ ఆదారంగా కారును గుర్తించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
తీగ లాగితే డొంక అంత కదిలినట్టు దొంగ నోట్ల ముఠా గుట్టంతా రట్టైంది. లక్షేట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కానుగంటి. క్రాంతి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాసతో దొంగ నోట్ల దందాకు తెరలేపినట్టు గుర్తించారు పోలీసులు. మరో ఐదుగురి తో కలిసి ముఠా గా ఏర్పడి ఆంద్రప్రదేశ్ కాకినాడకు చెందిన రాము అనే వ్యక్తి సాయంతో ఏకంగా 20 లక్షల నకిలీ నోట్లను లక్షేట్టిపేట కు తరలించినట్టు గుర్తించారు పోలీసులు.
లోతుగా విచారణ చేపట్టిన లక్షేట్టిపేట పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి మూడు కార్లు , 12 సెల్ ఫోన్లు , 5,98,500 నకిలీ కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల రవాణాలో కీలకంగా ఉన్న ఆంద్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టుగా మంచిర్యాల ఏసీపి ప్రకాశ్ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ , సిబ్బందిని ఏఎస్పీ ప్రకాష్ అభినందించారు.
- A1 కానగంటి క్రాంతి, లక్షెట్టిపేట రియల్ ఎస్టేట్ వ్యాపారి
- A2 గడిగొప్పుల రవీందర్, ఆటో డ్రైవర్, లక్షెట్టిపేట
- A3 తాండ్ర ప్రకాష్ Rk 6, శ్రీరాంపూర్
- A4 కొంక మధుకర్, వెంకట్రావు పేట
- A5 సుంకే సురేష్,గోదావరిఖని
- A6 కామిని అనిల్, సుల్తానాబాద్
- A7 రామ్ నాయక్ బేకరీ. లక్షేటిపేట
- A8 నగునూరి రాము, లక్షేట్టిపేట
- A9 దేవబోయిన సంపత్ కుమార్ (బెజ్జంకి)
- A10 కాడుమండ్ల తిరుపతి (జెండా వెంకటాపూర్)
- A11 గోల్ల కుమారస్వామి (పెరకపల్లి)
- A12 బండారి సత్యనారాయణ (రంగపేట) గా గుర్తింపు
పరారీలు ఉన్న నిందితులు:
- A13 రాము, కాకినాడ
- A14 రవి, కాకినాడ లుగా తేల్చారు.
- నరేష్ గొల్లన , ఉమ్మడి ఆదిలాబాద్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
