కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయం, మెదడు, గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చక్కెర లేని బ్లాక్ కాఫీని నిద్రలేచిన 60-90 నిమిషాల తర్వాత 1-3 కప్పుల వరకు తాగడం ఉత్తమం. ఖాళీ కడుపుతో లేదా రాత్రి వేళల్లో తాగకూడదు. సరైన కాఫీ ఎంపిక, రోస్టింగ్ పద్ధతులు కీలకం.