AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే

సమాజంలో సొంత తెలివితేటలు లేకపోయినా, ఇతరుల ఐడియాలను కాపీ కొడుతూ మేధావుల్లా బిల్డప్ ఇచ్చే వ్యక్తులు ఎందరో ఉంటారు. సైకాలజీలో దీనిని 'డన్నింగ్ క్రుగర్ ఎఫెక్ట్' అంటారు. తియ్యటి మాటలతో బురిడీ కొట్టించే ఇలాంటి వారి అసలు నైజం, వారి వెనుక ఉన్న మానసిక స్థితిని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.

పక్కవాడి ఐడియాలతో బిల్డప్..! క్రుగర్ ఎఫెక్ట్ బాధితుల అసలు స్వరూపం ఇదే
Build Up
Nikhil
|

Updated on: May 01, 2026 | 10:52 PM

Share

మన సమాజంలో విలక్షణమైన మనుషులు కనిపిస్తుంటారు. కొందరు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ శిఖరాలను అధిరోహిస్తే, మరికొందరు మాత్రం అడుగు దూరంలో ఉన్న గమ్యాన్ని కూడా సొంతంగా చేరుకోలేక, పక్కవాడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ ‘బిల్డప్’ ఇస్తుంటారు. సైకాలజీ భాషలో వీరిని రకరకాల పేర్లతో పిలిచినా, వీరి అసలు నైజం మాత్రం ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టడం. వీరికి విశ్లేషణాత్మక ఆలోచనలు సున్నా, కానీ ఇతరుల ఐడియాలను దొంగిలించడంలో మాత్రం పీహెచ్‌డీలు చేస్తుంటారు. మౌనంతోనే మేడలు కట్టే రకమైన వీరు, తియ్యటి మాటలతో ఎదుటివారిని బురిడీ కొట్టించడంలో దిట్టలు.

అజ్ఞానమే ఆభరణం

ఇలాంటి వ్యక్తుల వెనుక ఉన్న మానసిక స్థితిని సైకాలజీలో ‘డన్నింగ్ క్రుగర్ ఎఫెక్ట్’ అంటారు. అంటే, ఏ విషయం మీదైతే అవగాహన తక్కువగా ఉంటుందో, వారే తాము మహా మేధావులమని, తమకు అన్నీ తెలుసని భ్రమపడుతుంటారు. ఈ భ్రమలో వారు తమ అజ్ఞానాన్ని కూడా గుర్తించలేరు. అందుకే పక్కవాడు కష్టపడి రూపొందించిన బిజినెస్ ప్లాన్ లేదా ఇతర క్రియేటివ్ పనులను తమ సొంత ఆలోచనలుగా బిల్డప్ ఇస్తుంటారు. వీరిలో సృజనాత్మకత అస్సలు ఉండదు, కేవలం ఇతరుల నీడలో బతకడమే వీరి జీవిత పరమార్థం.

మాటల వెనుక విషం

వీరు ఇతరులను తమ వలలో వేసుకోవడానికి ‘లవ్ బాంబింగ్’ అనే సైకలాజికల్ ట్రిక్ ఉపయోగిస్తారు. అవసరం ఉన్నప్పుడు అవతలి వ్యక్తిని ఆకాశానికి ఎత్తుతూ, “నీ అంత గొప్పవాడు లేడు” అంటూ వారి అహాన్ని సంతృప్తి పరుస్తారు. ఇలా తియ్యటి మాటలతో వారిని లోబర్చుకుని, కావాల్సినవన్నీ లాగేస్తారు. తీరా అవసరం తీరిన తర్వాత అదే వ్యక్తిని తొక్కేయడానికి ఏమాత్రం వెనుకాడరు. నిజానికి వీరి లోపల తీవ్రమైన ఆత్మన్యూనత భావం ఉంటుంది, దానిని కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతుంటారు.

నిజమైన తెలివితేటలు లేని చోట కేవలం ట్రిక్కులు మాత్రమే పనిచేస్తాయి. ఇలాంటి వారు ఎప్పటికీ స్వతంత్రంగా ఎదగలేరు, ఎప్పుడూ ఎవరో ఒకరిని అనుకరిస్తూనే ఉంటారు. నిప్పును ఎంతకాలం దాచలేమో, వీరి అసలు స్వరూపం కూడా ఏదో ఒకరోజు బయటపడుతుంది. మానసిక విశ్లేషకుల ప్రకారం, తియ్యగా మాట్లాడే ప్రతివాడూ శ్రేయోభిలాషి కాదు. మీ పాజిటివ్ ఎనర్జీని ఇలాంటి గాలి బుడగలకు అప్పగించకుండా, మీ ఎదుగుదల కోసం వాడుకోవాలి. సింహంలా ఒంటరిగా వేటాడి ఎదగాలే తప్ప, గొర్రెల్లా గుంపులో ఉంటూ పక్కవారిని అనుసరించకూడదని గుర్తుంచుకోండి.

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం