మామిడి పండ్లను వీటితో కలిపి తిన్నారో మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే
Krishna
01 May 2026
చాలా మంది మామిడి పండ్లను పాలతో కలిపి షేక్‌గా తీసుకుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. ఇలా చేయకూడదు. ఈ విరుద్ధ కలయిక వల్ల శరీరంలో పిత్త దోషం పెరిగి, జీర్ణక్రియ మందగిస్తుంది.
పాలు
పెరుగు చలువ చేస్తుంది, మామిడి వేడి చేస్తుంది. ఈ రెండు భిన్న స్వభావాలు కలిగిన ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల కడుపులో పులియడం జరిగి గ్యాస్, ఉబ్బరం, చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
పెరుగు
మామిడి తింటున్నప్పుడు నిమ్మకాయ వంటి పుల్లని పండ్లను కలిపి తీసుకోకూడదు. ఇది కడుపులో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు.
సిట్రస్ పండ్లు
పూరీలు లేదా సమోసాల వంటి వేయించిన ఆహారం తిన్న వెంటనే మామిడి పండు తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతుంది.
వేయించిన పదార్థాలు
మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మామిడిలోని సహజ చక్కెరలు వీటితో కలిసినప్పుడు జీర్ణాశయంపై భారం పెరిగి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.
మాంసాహారం
మామిడి తిన్న వెంటనే కారంగా ఉండే పదార్థాలు తినడం వల్ల జీర్ణశయాంతర సమస్యలు రావచ్చు. ఇది చర్మంపై దద్దుర్లు లేదా మొటిమలు రావడానికి కూడా కారణం కావచ్చు.
కారం - మసాలాలు
మామిడి పండులో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. మామిడి తిన్న వెంటనే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.
కోల్డ్ డ్రింక్స్ :
మామిడి తిన్న వెంటనే చేదుగా ఉండే పదార్థాలు తినడం వల్ల వికారం, వాంతులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అసౌకర్యాలు కలిగే అవకాశం ఉంది.