మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, బోడ్రాయి తండాలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో రైతు తేజావత్ సాముల్ నాయక్ కు చెందిన మూడు ఎకరాల టేకు తోట అగ్నికి ఆహుతైంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా 13 ఏళ్లుగా పెంచుకున్న సుమారు 80 టేకు చెట్లు కాలి బూడిదయ్యాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లడంతో రైతు పరిహారం కోసం వేడుకుంటున్నాడు.