AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..

ఆధునిక కాలంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మారుతున్న జీవనశైలి, సరికాని ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వంటివి ఈ ప్రాణాంతక వ్యాధికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మనం తెలియకుండా చేస్తున్న తప్పులేంటి..? అనేది తెలుసుకుందాం..

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు.. పట్టించుకోకపోతే ప్రాణాలకే రిస్క్..
5 Lifestyle Habits Increasing Cancer Risk
Krishna S
|

Updated on: May 01, 2026 | 10:30 PM

Share

మనిషికి ప్రాణసంకటంగా మారిన వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ మహమ్మారి, నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశంలో క్యాన్సర్ కేసుల పెరుగుదల రేటు ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం అనుసరిస్తున్న ఆధునిక జీవనశైలి, తింటున్న ఆహారమే ఈ విపత్తుకు ప్రధాన కారణం. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం..? క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

 ప్యాకెట్ ఫుడ్స్ అంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకునే సమయం లేక చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై ఆధారపడుతున్నారు. ప్యాక్ చేసిన ఆహారం పాడవకుండా ఉండేందుకు వాడే ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. సోడాలు, కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ చిప్స్‌లో ఉండే అధిక చక్కెర, సోడియం కణాల విభజనలో అసాధారణ మార్పులకు కారణమవుతాయి. హోటళ్లు, రోడ్డు పక్కన దొరికే బజ్జీలు, సమోసాల కోసం నూనెను పదే పదే మరిగిస్తారు. ఇలా చేయడం వల్ల అందులో కార్సినోజెన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి.

ప్లాస్టిక్ వినియోగం.. మౌన విషం

మనం తెలియకుండానే రోజూ ప్లాస్టిక్ ద్వారా విషాన్ని శరీరంలోకి పంపిస్తున్నాం. వేడి వేడి టీని ప్లాస్టిక్ కప్పుల్లో తాగడం లేదా వేడి అన్నాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయడం వల్ల ప్లాస్టిక్‌లోని బిస్ఫెనాల్-A వంటి రసాయనాలు ఆహారంలో కలుస్తాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యతకు మరియు క్యాన్సర్‌కు దారితీస్తాయి.

నిద్రలేమి – స్క్రీన్ అడిక్షన్

రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం కేవలం అలసటకే కాదు, క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది.

మెలటోనిన్ ప్రభావం: చీకటిగా ఉన్నప్పుడు మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. రాత్రి వేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం, స్మార్ట్‌ఫోన్ల నుండి వచ్చే బ్లూ లైట్‌ను చూడటం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి పడిపోతుంది.

ఒత్తిడి: నిరంతర పని ఒత్తిడి వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. ఇది కాలక్రమేణా కణాలను దెబ్బతీస్తుంది.

మత్తు పదార్థాలు: క్యాన్సర్‌కు రాజమార్గాలు

పొగాకు, ధూమపానం వల్ల వచ్చే నష్టం గురించి అందరికీ తెలుసు, కానీ చాలా మంది అశ్రద్ధ చేస్తారు.

పొగాకు: నోరు, గొంతు, అన్నవాహిక క్యాన్సర్‌లకు ప్రధాన కారణం.

పరోక్ష ధూమపానం: మీరు పొగ తాగకపోయినా, మీ పక్కన వారు తాగే పొగను పీల్చడం వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 20-30శాతం ఎక్కువగా ఉంటుంది.

ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే 90శాతం వరకు నయం చేయవచ్చు. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి..

అకస్మాత్తుగా బరువు తగ్గడం: ఎలాంటి డైట్ చేయకపోయినా నెల రోజుల్లో 4-5 కిలోల బరువు తగ్గడం.

మానని పుండ్లు: నోటిలో లేదా శరీరంపై ఎక్కడైనా పుండ్లు పడి చాలా కాలం వరకు తగ్గకపోవడం.

గడ్డలు: రొమ్ము భాగంలో లేదా మెడ, చంకల భాగంలో నొప్పిలేని గడ్డలు కనిపించడం.

మార్పులు: మల, మూత్ర విసర్జన అలవాట్లలో ఆకస్మిక మార్పులు లేదా రక్తస్రావం కావడం.

దీర్ఘకాలిక దగ్గు: మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండే దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం.

జీవనశైలి మార్చుకుందాం.

క్యాన్సర్ అనేది మరణశాసనం కాదు, కానీ దానిని నివారించడం మన చేతుల్లోనే ఉంది.

  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయండి.
  • ఆహారంలో పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
  • ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించి స్టీల్ లేదా గాజు పాత్రలను వాడండి.
  • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.
  • 40 ఏళ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం.

(గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం, వివిధ ఆరోగ్య నిపుణులు, నివేదికల ఆధారంగా అందించబడింది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.  మీకు ఏవైనా సందేహాలు ఉంటే, వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి.)

Follow Us
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత