AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

దేశంలో కోట్లాదిమంది సెల్ ఫోన్ లు వినియోగిస్తున్నారు. తమ అవసరాలకు సమాచార మార్పిడికి సెల్ ఫోన్లను వాడుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా కాల్ చేస్తేనే ఫోన్ రింగ్ అవుతుంది. కానీ మే 2న శనివారం మాత్రం దేశవ్యాప్తంగా లక్షల ఫోన్లలో ఒక్కసారిగా సైరన్ శబ్దం వినిపించబోతోంది. ఈ సైరన్ శబ్దం ఎందుకు వినిపించబోతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?
Emergency Alert Test
M Revan Reddy
| Edited By: |

Updated on: May 02, 2026 | 12:01 AM

Share

ఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా మెరుగైన పద్ధతుల్లో సత్వరంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.

మే 2న దేశవ్యాప్తంగా లక్షలాది మంది మొబైల్ ఫోన్లలో ఒక్కసారిగా పెద్ద సైరన్ శబ్దం వినిపించవచ్చు. మొబైల్‌కు ఒక మెసేజ్ వస్తుంది. దాంతో పాటు పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం ఒక ‘టెస్ట్’ మాత్రమే. కాబట్టి ఈ మెసేజ్ లేదా శబ్దం చూసి మీరు ఏమీ చేయక్కర్లేదు. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ సిఫార్సు చేసిన ఈ టెక్నాలజీ ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.

ఈ సరికొత్త సాచెట్ అనే కొత్త సిస్టం పనితీరును శనివారం దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా సైరన్ శబ్దంతో పరీక్షించనున్నారు. ఈ సైరన్ ద్వారా ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సెకన్ల వ్యవధిలో వేలమందికి సత్తర సమాచారం చేరనుంది. వరదలు లేదా తుఫానులు వచ్చే ముందు హెచ్చరికలు పంపడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఉన్న ఫోన్లకు మాత్రమే ఈ అలర్ట్ మెసేజ్, సైరన్ శబ్దం వెళ్లేలా ఈ టెక్నాలజీని రూపొందించారు.

శనివారం మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా కూడా ఈ సైరన్ వినిపించే అవకాశం ఉంది. మీ ఫోన్‌లో సైరన్ మోగినా లేదా ఎమర్జెన్సీ అలర్ట్ అని మెసేజ్ వచ్చినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇది కేవలం ప్రభుత్వం చేస్తున్న చిన్న టెస్టింగ్ అని మాత్రమే గుర్తించాలని కేంద్రం తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!