AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ధనలాభం.. మీ రాశి ఎలా ఉంది?

Horoscope Today (01 August, 2026): శనివారం రాశి ఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడగా, వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వారికి అదనపు ఆదాయ యోగం కలుగుతుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, విద్య రంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకోండి.

ఆగస్టు 1 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ధనలాభం.. మీ రాశి ఎలా ఉంది?
Rashi Phalalu 01 August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (ఆగస్టు 1, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. మిథున రాశి వారికి అదనపు ఆదాయానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలను అందుకుంటారు. దూర ప్రయాణాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాల్లో ఉన్న కొన్ని ప్రధానమైన అడ్డంకుల్ని అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ వ్యవహారాలు సజావుగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవ హరించడం మంచిది. అదనపు ఆదాయానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల బాధ్య తల్ని కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. బంధువుల విషయాల్లో కల్పించుకోకపోవడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు లాభిస్తాయి. వ్యాపారాల పరిస్థితి నిలకడగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అదనపు ఆదాయానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొం టారు. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమి స్తాయి. ఎలాంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశముంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడు తుంది. వ్యాపారాలు నిలకడగా, ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఉంటాయి. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్ర మంలో పాల్గొంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలకు అనుకోకుండా పరిష్కారం లభిస్తుంది. ఆదాయం, ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతల్ని అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ద పెరుగుతుంది. కుటుం బసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్త వుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనేక విధాలుగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృథా ఖర్చులు తగ్గించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీగా, లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపట్టి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలను పట్టుదలగా వసూలు చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహక రిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యో గులకు మంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల, సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సా హంగా సాగిపోతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు సాయం చేయడం జరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో కూడా కొద్దిగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరి ష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రులతో వాదోపవాదా లకు దిగవద్దు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా గడిచిపోతుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణ యాలు తీసుకుంటారు. చాలా కాలంగా పూర్తికాని పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ముఖ్య మైన వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సాఫీగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల మీద శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో, ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. నిరుద్యో గులకు మంచి ఆఫర్ అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది.

ఆగస్టు 2026 మాసఫలాలు: మేష రాశి | వృషభ రాశి | మిథున రాశి | కర్కాటక రాశి | సింహ రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చిక రాశి | ధనుస్సు రాశి | మకర రాశి | కుంభ రాశి | మీన రాశి

మాసఫలాలు: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..

గమనిక: ఈ మాస ఫలాలు గ్రహస్థితులు, జ్యోతిష్య సూత్రాల ఆధారంగా సాధారణంగా రూపొందించబడినవి. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, జన్మ నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వీటిని కేవలం విశ్వాసం, అవగాహన కోసమే పరిగణించాలి. ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, విద్య లేదా ఉద్యోగ సంబంధిత నిర్ణయాల కోసం సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us