AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం, వ్యాపారంలో లాభాలు

Dhanusu Rasi August 2026 Monthly Horoscope: ఆగస్టు 2026లో ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగం, కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు, కుటుంబ సుఖం కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉండగా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది.

ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం, వ్యాపారంలో లాభాలు
Dhanusu Rasi August 2026 Horoscope
Janardhan Veluru
|

Updated on: Jul 31, 2026 | 12:47 PM

Share

ఆగస్టు 2026లో ధనుస్సు రాశి వారికి కుజుడు, రాహువు, శుక్రుడు అనుకూల స్థానాల్లో సంచరించడం వల్ల అనేక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ నెల కొత్త సమస్యలు లేదా ఒత్తిళ్లు పెద్దగా లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేపట్టే పనుల్లో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉన్నతాధికారుల ఆదరణ లభించడంతో పాటు అధికార యోగం లేదా పదోన్నతి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రముఖ కంపెనీల నుంచి మంచి ఆఫర్లు రావచ్చు. నిరుద్యోగులకు కూడా ఆశించిన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.

వ్యాపారులకు గతంలో ఎదురైన నష్టాలు తగ్గి లాభాల బాటపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే సంపాదనలో కొంత భాగాన్ని పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత నెలకొంటాయి. పిల్లలు విద్యలో పురోగతి సాధించి మంచి ఫలితాలు సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి ఆలయ దర్శనాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందిస్తారు. ఆరోగ్యపరంగా స్వల్ప అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో జీవనశైలిపై శ్రద్ధ అవసరం. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా కొనసాగుతాయి. మొత్తంగా ఆగస్టు నెల ధనుస్సు రాశి వారికి కెరీర్, ఆర్థికం, కుటుంబం, ఆధ్యాత్మికత పరంగా పురోగతిని అందించే శుభకాలంగా నిలుస్తుంది.

ఆగస్టు 2026 మాసఫలాలు: మేష రాశి | వృషభ రాశి | మిథున రాశి | కర్కాటక రాశి | సింహ రాశి | కన్య రాశి | తుల రాశి

మాసఫలాలు: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..

గమనిక: ఈ మాస ఫలాలు గ్రహస్థితులు, జ్యోతిష్య సూత్రాల ఆధారంగా సాధారణంగా రూపొందించబడినవి. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, జన్మ నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వీటిని కేవలం విశ్వాసం, అవగాహన కోసమే పరిగణించాలి. ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, విద్య లేదా ఉద్యోగ సంబంధిత నిర్ణయాల కోసం సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
తుల రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికారం, అదృష్టం..!
మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది..
మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది..
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది మైనర్లు మృతి!
బొగ్గు గనిలో భారీ పేలుడు.. 32 మంది మైనర్లు మృతి!
కాలికి రెండు వేళ్లు మాత్రమే ఉండే క్రికెటర్.. ఎవరో తెలుసా?
కాలికి రెండు వేళ్లు మాత్రమే ఉండే క్రికెటర్.. ఎవరో తెలుసా?
శ్రీలంకపై టెస్టుల్లోపరుగుల వర్షం కురిపించిన భారత బ్యాటర్లు వీళ్లే
శ్రీలంకపై టెస్టుల్లోపరుగుల వర్షం కురిపించిన భారత బ్యాటర్లు వీళ్లే
కన్య రాశి ఆగస్టు మాసఫలాలు.. ఉద్యోగంలో పురోగతి, మెరుగైన ఆరోగ్యం
కన్య రాశి ఆగస్టు మాసఫలాలు.. ఉద్యోగంలో పురోగతి, మెరుగైన ఆరోగ్యం