AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

August 2026 Horoscope: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..

Monthly Horoscope (August 2026): ఆగస్టు 1 నుంచి 31, 2026 వరకు గ్రహాల సంచార ప్రభావంతో 12 రాశుల వారి జీవితాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మేష రాశి వారికి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావడంతో పాటు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూల సమయం ఉండగా, మిథున రాశి వారు ఆశించిన పనులను విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరి మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2026 | 3:37 PM

Share
మాస ఫలాలు (ఆగస్టు 1-31, 2026): మేష రాశి వారికి ఆగస్టు నెలలో  పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశివారికి ఈ నెలంతా చాలావరకు ఆశించిన విధంగా వైభవంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆగస్టు మాసఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 13
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రవి, కుజ, రాహు, గురు గ్రహాలు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆగస్టు మాసంలో ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుతుంది.  ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. రాదనుకున్న సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని వ్యవహారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. విశ్రాంతి తగ్గే సూచనలున్నాయి. కుటుంబ పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

2 / 13
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలో శనీశ్వరుడు, పంచమంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం కారణంగా ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితంలో సమస్యలు తొల గిపోయి, అన్యోన్యత పెరుగుతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యో గాలపరంగా ఊహించని అదృష్టం పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధి స్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

3 / 13
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు, రవి, శుక్ర, రాహు గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఈ నెలంతా చాలావరకు ఆశించిన విధంగా వైభవంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు బాగా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధి స్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరు గుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగా వకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.

4 / 13
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శుభ గ్రహాలన్నీ దాదాపు అనుకూల సంచారం చేస్తున్నందువల్ల నెలంతా బాగా అనుకూలంగా, సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సర్వత్రా మీ ప్రాధాన్యం పెరుగుతుంది. మీ మాటకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

5 / 13
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రవి, శుక్ర, కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగు తాయి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. ఆర్థిక లావాదేవీల్లో నష్టపోయే అవ కాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినా, ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువుల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది.

6 / 13
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రాశ్యధిపతి బుధుడితో పాటు, గురు, శుక్రుల అనుకూలత కూడా పెరగడం వల్ల కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశముంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతా వరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.  అనుకోకుండా ఒకటి రెండు శుభ వార్తలు వినడం జరుగుతుంది.

7 / 13
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ నెలంతా గురు, బుధ, కుజ, శని, రవి గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టే అవకాశం ఉంది. అధికారులకు మీ పనితీరు, సమర్థత నచ్చు తాయి. ప్రతిభాపాటవాలు బాగా రాణిస్తాయి. సామాజికంగా కూడా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

8 / 13
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. కొద్ది శ్రమతో ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని, పెండింగ్ పనుల్ని చక్కబెడతారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంటా బయటా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరు గుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ప్రాంతాల్ని సందర్శిస్తారు. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగు తాయి. నిరుద్యోగులు తగిన ఉద్యోగంలో చేరడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.

9 / 13
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కుజ, రాహు, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా ఆశించిన విధంగా గడిచిపో తుంది. కొత్తగా సమస్యలు, ఒత్తిళ్లు ఉండకపోవచ్చు. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఏ రంగానికి చెందినవారైనాకీ ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాలు తగ్గి, లాభాల బాటపడతాయి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురో గతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అను కూలిస్తాయి. బంధుమిత్రుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

10 / 13
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయంలో రాశ్యధిపతి శనీశ్వరుడు, సప్తమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెలంతా చాలావరకు సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయం లోనైనా మీ మాట నెగ్గుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. నిరుద్యోగులకు స్వదేశంలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ తప్పకపో వచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

11 / 13
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): శని, కుజ, రవుల అనుకూల సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధ గ్రహం కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల సమయ స్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. కుటుంబ బాధ్యతల నిర్వహణలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపా రాలు ఊపందుకుంటాయి. ముఖ్యమైన పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉచిత సహాయాలకు, దానధర్మాలకు దూరంగా ఉండడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలుంటాయి.

12 / 13
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, రవి, బుధుల అనుకూలత పెరగడం వంటి కారణాల వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశముంది.  ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలను సొంత ఆలోచనలతో నిర్వ హించుకుని లబ్ధి పొందడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.  ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగుతాయి. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

13 / 13
Follow Us
పంట వేసిన ఏడాదిన్నర నుంచే కాపు వచ్చే పనస రకం..

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది.. అదృష్ట రాశులివే..

కేవలం మూడ్రోజులే టైమ్.. రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్..

పండగల వేళ మీ ఎత్నిక్ లుక్‌ను రెట్టింపు చేసే గాజుల కాంబినేషన్లు

ఊటీ-కూనూర్ టూర్‌కు సూపర్ ఆఫర్.. హైదరాబాద్ నుంచి 6 రోజుల ప్యాకేజీ

మీకు స్నేహితులు ఎవరూ లేరా?.. ఈ వ్యాధుల ముప్పు వీరికే ఎక్కువట!

ఎగ్ తినేవారు నాన్ వెజిటేరియన్సా?.. శాస్త్రవేత్తలు చెబుతున్నదిదే

ఇది తాగితే ఒంట్లో నీరసం పోయి రాత్రికి రాత్రే ఉక్కులా మారతారు

ఇక మధ్యాహ్న భోజనంలో 'చికెన్‌ బిర్యానీ'..? విద్యార్ధులు పండగే