AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిథున రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో గుర్తింపు, కోరికలు నెరవేరుతాయి..!

Gemini Monthly Horoscope August 2026: ఆగస్టు 2026లో మిథున రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, కొత్త అవకాశాలు లభించే అవకాశముంది. విదేశీ ఉద్యోగ సమాచారంతో పాటు కుటుంబ సుఖం, ప్రేమలో విజయం, విద్యలో పురోగతి లభించే సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తై కోరికలు నెరవేరే అనుకూలమైన నెలగా చెప్పవచ్చు.

మిథున రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో గుర్తింపు, కోరికలు నెరవేరుతాయి..!
Mithuna Rasi August 2026 Horoscope:
Janardhan Veluru
|

Updated on: Jul 31, 2026 | 11:52 AM

Share

ఆగస్టు 2026లో మిథున రాశి వారికి గ్రహాల అనుకూల సంచారం కారణంగా జీవితంలోని దాదాపు అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. రాశ్యాధిపతి బుధుడితో పాటు రవి, శుక్రుడు, రాహువు అనుకూల స్థానాల్లో ఉండటంతో ఈ నెల ఆశించిన విధంగా విజయవంతంగా, వైభవంగా సాగుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి ముఖ్యమైన కార్యంలో కార్యసిద్ధి కలిగే సూచనలు ఉన్నాయి.

ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల ప్రశంసలు, ఆదరణ లభిస్తాయి. మీ ఆలోచనలు, సూచనలు ఉన్నతాధికారులకు ఉపయోగపడతాయి. పదోన్నతి, బాధ్యతలు పెరగడం లేదా ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఆశించిన సమాచారం అందే సూచనలు ఉన్నాయి.

వ్యాపారులు, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారికి ఈ నెలలో లాభదాయకమైన అవకాశాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కొనసాగుతాయి. విద్యార్థులు పరీక్షలు, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య పరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక సంతృప్తి పొందుతారు. మొత్తంగా ఆగస్టు నెల మిథున రాశి వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, విద్య, వ్యక్తిగత జీవితంలో పురోగతిని అందించే శుభకాలంగా నిలుస్తుంది.

మేష రాశి వారికి ఆగస్టు 2026 మాసఫలాలు

వృషభ రాశి వారికి ఆగస్టు 2026 మాసఫలాలు

మాసఫలాలు: ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది..! అదృష్ట రాశులివే..

గమనిక: ఈ మాస ఫలాలు గ్రహస్థితులు, జ్యోతిష్య సూత్రాల ఆధారంగా సాధారణంగా రూపొందించబడినవి. వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు, జన్మ నక్షత్రం వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. వీటిని కేవలం విశ్వాసం, అవగాహన కోసమే పరిగణించాలి. ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, విద్య లేదా ఉద్యోగ సంబంధిత నిర్ణయాల కోసం సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us