AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: శని-శుక్రుడి దృష్టి.. ఆగస్టు నెలంతా వారికి పట్టిందల్లా బంగారమే..!

ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు శని–శుక్ర గ్రహాల మధ్య ఏర్పడనున్న పరస్పర దృష్టి జ్యోతిష్యపరంగా అత్యంత శుభప్రదమైన యోగంగా భావిస్తారు. ఈ కాలంలో వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి రంగాల్లో అనుకూల మార్పులు చోటుచేసుకోవడంతో పాటు, శని దోష ప్రభావం కూడా కొంత వరకు తగ్గుతుంది.

Astrology: శని-శుక్రుడి దృష్టి.. ఆగస్టు నెలంతా వారికి పట్టిందల్లా బంగారమే..!
Golden Days In August 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 30, 2026 | 1:24 PM

Share

మిత్ర గ్రహాలైన శని, శుక్రుల మధ్య ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు పరస్పర దృష్టి ఏర్పడుతోంది. మీన రాశిలో సంచారం చేస్తున్న శనితో కన్యారాశిలో ఉన్న శుక్రుడికి ఈ దృష్టి ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు చూసుకోవడం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా ఘన విజయం సాధించడం జరుగుతుంది. జీవితంలో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అంతేకాక, ఈ సమసప్తక దృష్టి వల్ల శని దోషం బాగా తగ్గుతుంది. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి.

  1. వృషభం: పంచమ స్థానంలో ప్రవేశించిన రాశ్యధిపతి శుక్రుడికి, లాభ స్థానంలో ఉన్న శనీశ్వరుడికి పరస్పర దృష్టి ఏర్పడినందువల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారమవుతుంది. ఈ రాశికి శని అత్యంత శుభుడైనందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచ నాల్ని దాటుతాయి. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా అరుదైన విదేశీ అవకాశాలు లభి స్తాయి.
  2. మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడికి, దశమస్థానంలో ఉన్న శనికి సమసప్తక దృష్టి ఏర్పడడం వల్ల ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఒక సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నం అంచనాలకు మించి లాభిస్తుంది.
  3. కన్య: ఈ రాశిలో ప్రవేశించిన శుక్రుడికి, సప్తమ స్థానంలో ఉన్న శనికి మధ్య పరస్పర దృష్టి ఏర్పడినం దువల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడానికి, పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. సొంత ఇంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న శుక్రుడికి, పంచమ స్థానంలో ఉన్న శనికి పరస్పర వీక్షణ ఏర్పడి నందువల్ల విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడికి తృతీయ స్థానంలో ఉన్న రాశ్యధిపతి శనికి వీక్షణ ఏర్పడడం వల్ల ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు, ఆశలు, ఆకాంక్షలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  7. కుంభం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శనికి, అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడినందువల్ల ఊహించని రీతిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభించడంతో పాటు రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. సామాజిక స్థాయి, హోదా పెరుగుతాయి.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న జ్యోతిష్య ఫలితాలు గ్రహాల సంచారాలు, జ్యోతిష్య సిద్ధాంతాలు, సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఇవి సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, గోచారాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. దీనిని ఖచ్చితమైన ఫలితంగా పరిగణించరాదు. వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us