AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagpur Blast: 24 గంటల్లోనే మరో ఘటన.. బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 15 మంది మృతి!

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఓ బాణసంచా గోడౌన్‌లో ఒక్కాసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది వరకు కార్మికులు మృతి చెందగా మరో 18 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కూడా ధ్వంసం అయినట్టు సమాచారం.

Nagpur Blast: 24 గంటల్లోనే మరో ఘటన.. బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 15 మంది మృతి!
Nagpur Blast
Anand T
|

Updated on: Mar 01, 2026 | 10:58 AM

Share

బాణాసంచా కర్మాగారాల్లో మరణ మృదంగం ఆగడం లేదు. నిన్నటినుంచి మృత్యుఘోష వినిపిస్తోంది. నిన్న కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పేలుడు జరిగిన 21 మంది కార్మికులు చనిపోయిన ఘటన మరువక ముందే అలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగు చూసింది. తాజాగా నాగ్‌పూర్‌లోని ఓ బాణాసంచా గోడౌన్‌లో పేలుడు జరిగి సుమారు 18 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. మరికొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. కటోల్ తహసీల్‌లోని రౌల్గావ్‌లో ఉన్న మైనింగ్, పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ సంస్థ SBL ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ సంఘటన ఈ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మార్నింగ్‌ షప్ట్ చేసే కార్మికులు ఉదయం పనికి వచ్చి పేలుడు పదార్థాల తయారీ చేస్తున్న క్రమంలో ఈ భారీ పేలుడు జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

పేలుడు జరిగిన సమయంలో కంపెనీ యూనిట్‌లో దాదాపు 25 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు తర్వాత, కంపెనీలో భారీ మంటలు చెలరేగాయి, ఆ మంటలు కొద్ది క్షణాల్లోనే ఫ్యాక్టీరి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో కొందరు కార్మికులు మంటల్లోంచి బయటకు రాలేక అక్కడే సజీవ దహనం అయిపోయారు. మరి కొందరు ప్రాణాలు బయటకు పరుగులు పెట్టారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరి కొందరు రెస్క్యూ సిబ్బంది గాయపడిన 15 మందిని చికిత్స నిమిత్తం నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, కొంతమంది కార్మికులు ఇంకా లోపల చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని బయటకు తెచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us