Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ జీతమెంతో తెలుసా ??
సినీ సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు తమ భద్రత దృష్ట్యా వ్యక్తిగత సెక్యూరిటీని నియమించుకుంటారు. వారు ఎక్కడికి వెళ్లినా వీరు వారికి రక్షణగా వెళ్తుంటారు. అయితే ఈ సెలబ్రిటీల దగ్గర పనిచేసే బాడీగార్డ్‌లకు జీతాలు ఎంత ఉంటుందో అనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. సెలబ్రిటీలకు సెక్యూరిటీ అంటే కాస్త క్లిష్టమైనపనే.
వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వారిని కాపడుకుంటారు. అందుకే వారికి చెల్లించే వేతనాలు కూడా భారీగానే ఉంటాయి. తాజాగా మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన సెక్యూరిటీకి చెల్లించే వేతనానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్యరాయ్ సెక్యూరిటీ గార్డ్ శివరాజ్ అందుకుంటున్న జీతం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. అతని వేతనం బహుళజాతి కంపెనీల సీఈఓల కంటే అధికంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతకీ ఐశ్వర్యరాయ్ బాడీగార్డు శివరాజ్ నెల జీతం ఎంతంటే.. అక్షరాలా రూ.7 లక్షలు. అంటే ఏడాదికి రూ.84 లక్షలను అతను వేతనంగా ఐశ్వర్య రాయ్ నుండి అందుకుంటున్నాడని సమాచారం. దేశ విదేశాల్లో ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా శివరాజ్ ఆమె వెన్నంటే ఉంటాడు. బాడీగార్డుగా విధులు నిర్వహిస్తున్న శివరాజ్ .. బచ్చన్ కుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. 2015లో శివరాజ్ వివాహానికి సైతం ఐశ్వర్య హాజరై నూతన దంపతులను అభినందించారు. దీనిని బట్టి బాడీగార్డు శివరాజ్‌కు బచ్చన్ కుటుంబం ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే

వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేయగా.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..

పామును బంధించేందుకు ప్రయత్నించిన స్నేక్ క్యాచర్‌కు ఝలక్..

వీర భక్తుడు అనుకునేరు.. అసలు విషయం వేరే..

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్‌లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్‌గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో
