AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arunachalam: అరుణాచలం వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి మరో సూపర్ న్యూస్.. ఇక నుంచి నేరుగా..

తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త. రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. నాంపల్లి-కన్యాకుమారి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యూలర్ సర్వీసుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక కాచిగూడ-మధురై ఎక్స్‌ప్రెస్‌ను తూత్తుగూడి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. వీటి వివరాలు చూద్దాం.

Arunachalam: అరుణాచలం వెళుతున్నారా..? రైల్వేశాఖ నుంచి మరో సూపర్ న్యూస్.. ఇక నుంచి నేరుగా..
Arunachalam
Venkatrao Lella
|

Updated on: Mar 01, 2026 | 10:17 AM

Share

తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. తరచూ రెండు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు శివుడి దర్శనం కోసం వెళ్తుంటారు. గిరిప్రదక్షిణ చేసిన అనంతరం శివుడిని దర్శించుకుంటారు. ఇక పౌర్ణమి రోజుల్లో అయితే గిరిప్రదక్షిణకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అరుణాచలంకు రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ సర్వీసులు ఎంతగానే ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తచ్చింది. తాజాగా దీని వివరాలను వెల్లడించింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెగ్యూలర్ సర్వీసుగా మార్పు

ప్రస్తుతం నాంపల్లి-కన్యాకుమారి(07229/07230) ఎక్స్‌ప్రెస్ ఇప్పటివరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా సర్వీసులు అందిస్తోంది. అయితే ఇక నుంచి దీనిని రెగ్యూలర్ సర్వీసుగా మార్చుతూ రైల్వేశాఖ నిర్ణయించింది. ఇక రైలు నెంబర్‌ను కూడా మార్చారు. ఇక నుంచి 17069/17070గా నెంబర్ మార్చారు. ఈ రైలు సికింద్రాబాద్, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు. రేణిగుంట, తిరపపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, అనుణాచలం మీదుగా కన్యాకుమారికి చేరుకుంటుంది. ఇది ప్రతీ బుధవారం సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 2.30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది. ఇక శుక్రవారం ఉదయం 5.15 గంటలకు కన్యాకుమారి నుంచి బయల్దేరి శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది.

ఈ రైలు పొడిగింపు

ఇక కాచిగూడ-మధురై(17615/17616) రైలును తూత్తుగూడి వరకు పొడిగించారు. కాచిగూడ-తూత్తుగుడి ఎక్స్‌ప్రెస్‌గా దీనిని మార్చారు. ఇది సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మంగళవారం రాత్రి 10.45 గంటలకు తూత్తుగూడికి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం 7.45 గంటలకు తూత్తుగూడి నుంచి బయల్దేరి గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు కూడా అరుణాచలం మీదుగా వెళ్తుంది. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా అరుణాచలంకు పలు రైళ్లు తిరుగుతున్నాయి.

Follow Us