వాట్సాప్‌లో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ అకౌంట్ బ్యాన్ కావచ్చు

11 April, 2026

Subhash

మీరు వాట్సాప్‌ను ప్రతిరోజూ వాడుతుంటే జాగ్రత్త! నిబంధనలను చాలా కఠినతరం చేసింది. చిన్న తప్పు చేసినా మీ అకౌంట్ శాశ్వతంగా మూతపడవచ్చు. ఆ తప్పులేంటో తెలుసుకోండి.

హెచ్చరిక

చాలామంది ఫీచర్ల కోసం GB WhatsApp, WhatsApp Plus, Yo WhatsApp వంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడుతుంటారు. ఇలాంటి యాప్స్ వాడితే వాట్సాప్ మీ అకౌంట్‌ను వెంటనే బ్యాన్ చేస్తుంది. 

అఫీషియల్ యాప్

మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులకు లేదా మీకు తెలియని వారికి పదే పదే మెసేజ్‌లు పంపకండి. అవతలి వ్యక్తి మిమ్మల్ని 'Report' లేదా 'Block' చేస్తే, మీ అకౌంట్‌ బ్యాన్ చేసే అవకాశం

పరిచయం లేని వారికి

హింసను ప్రేరేపించే మెసేజ్‌లు, అశ్లీల వీడియోలు అలజడి సృష్టించే ఫేక్ న్యూస్‌ను ఫార్వార్డ్ చేయకండి. ఇలాంటి కంటెంట్ పంపి ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీ అకౌంట్‌ బ్యాన్‌.

ఫేక్ న్యూస్

ఒకేసారి వందల మందికి ఒకే రకమైన మెసేజ్‌లు పంపడం, ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ల ద్వారా మెసేజ్‌లు పంపడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం. దీనిని స్పామ్‌గా గుర్తిస్తుంది.

బల్క్ మెసేజ్‌లు

మీకు తెలియని వారిని లేదా ఇష్టం లేని వారిని బలవంతంగా గ్రూపుల్లో యాడ్ చేయకండి. గ్రూప్ యాక్టివిటీ పై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినా అడ్మిన్‌తో పాటు గ్రూప్ సభ్యుల అకౌంట్స్ కూడా ప్రమాదంలో

గ్రూప్ రూల్స్

ఒకవేళ మీ అకౌంట్ బ్యాన్ అయితే, వాట్సాప్‌ను ఓపెన్ చేసి Request a Review ఆప్షన్ ద్వారా అప్పీల్ చేసుకోండి. ఎటువంటి తప్పు చేయలేదని గుర్తిస్తే మీ అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది.

అకౌంట్ బ్యాన్

ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయవద్దు. లేకుంటే మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్యాన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇలాంటి తప్పులు