AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. చివరకు

మిస్డ్ కాల్‌తో పరిచయమయ్యాడు.. ఇన్స్టాలో దగ్గరయ్యాడు.. నమ్మకంగా ఉంటూ స్నేహం పెంచుకున్నాడు.. ఈజీ మనీ కోసం బెట్టింగ్ కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు.. అప్పటికే పరిచయం ఉన్న మహిళను అప్పుల నుంచి గట్టెక్కించేందుకు వినియోగించుకోవాలనుకున్నాడు. కుదరకపోయేసరికి హత్య చేసి నగదు నగలు ఎత్తుకెళ్లాడు. దర్యాప్తు బృందాలకు ముప్పు తిప్పలు పెట్టి ఎట్టకేలకు చిక్కాడు. వాడి ప్లాన్ మామూలుగా లేదు..

Vizag: ఆమెకు 52, అతనికి 34.. రాంగ్‌ కాల్‌తో కనెక్టయ్యారు.. చివరకు
Crime News
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Mar 01, 2026 | 10:13 AM

Share

విశాఖపట్నంలోని ఆరిలోవలో ఫిబ్రవరి 11న జరిగిన మహిళ హత్య సంచలనం సృష్టించింది. పోలీసులను పరుగులు పెట్టించింది. నిందితుడు టోపీ క్యాప్ తో వచ్చి హత్య చేసి నగలు నగదు ఎత్తుకెళ్ళాడు. ఆరిలోవ దుర్గానగర్‌ సెక్టార్‌-3లో ఈనెల 11న ఘటన జరిగింది. దుర్గానగర్‌లో చీటీలు నిర్వహించే కాపు లక్ష్మి (52) ని ఈనెల 11న గుర్తుతెలియని వ్యక్తి గొంతునులిమి హత్యచేసిన విషయం తెలిసిందే. సాయంత్రం డ్యూటీ నుంచి తిరిగి వచ్చినం భర్త చూసేసరికి ఆ వివిధ పడి ఉంది లక్ష్మి. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లక్ష్మీ శరీరంపై ఉండాల్సిన బంగారంతోపాటు ఇంట్లోని ఐదు లక్షలు కనిపించలేదని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సొత్తు కోసం ఎవరో హత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య జరిగిన ఇంట్లోని సీసీ కెమెరాతోపాటు చుట్టుపక్కల ఇళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. ఉదయం 10.12 గంటల సమయంలో తలకుటోపీ, ముఖానికి మాస్క్‌ ధరించిన వ్యక్తి ఒకరు ఇంట్లోకి వెళ్లి.. మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి బయటకు వచ్చి ఆటో ఎక్కివెళ్లిపోయినట్టు గుర్తించారు.

అక్కడే ఆ అనుమానం..!

తొలుత హత్యగా అనుమానించి లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ తర్వాత నగలు నగదు కోసం హత్య జరిగిందని తెలిసి క్రైమ్ బృందాలకు ఇన్వెస్టిగేషన్ బాధ్యత అప్పగించారు. సీసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సీసి ఫుటేజ్ అస్పష్టంగా ఉండడంతో పోలీసులు మరింత శ్రమించాల్సి వచ్చింది. అయితే నిందితుడు శివ వచ్చే ముందు ఓ ఆటో డ్రైవర్ మొబైల్ తో లక్ష్మి కి కాల్ చేశాడు. ఈ కేసులో ఆటో డ్రైవర్ ని కూడా పోలీసులు తీసుకొచ్చి విచారించారు. అతను ఎవరో తనకు తెలియదని చెప్పడంతో పోలీసులు క్రాస్ చెక్ చేసుకుని విడిచిపెట్టారు. దర్జాగా ఇంటికి వచ్చి నగలు దగదు పట్టుకెళ్లడంతో.. తెలిసిన వాడే పని అయి ఉంటుందని మృతురాలి సోదరి స్నేహితులు అనుమానించారు.

హత్య చేసి.. రాష్ట్రాలు తిరిగి..

అయితే.. లక్ష్మీ కుటుంబ సభ్యులు పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడు బొబ్బిలి ప్రాంతానికి చెందిన టాటూ శివ (34) గా గుర్తించారు పోలీసులు. విచారణ ముమ్మరం చేశారు. ఈ లోగా నిందితుడు.. హత్య చేసి సొత్తును పట్టుకొని ధన్బాద్ వెళ్ళాడు. అక్కడ నుంచి ఢిల్లీ, ఆ తరువాత కాశి వెళ్లి మళ్లీ తిరిగి ధన్బాద్ వచ్చాడు. అక్కడ నుంచి రాయగడ.. విశాఖ మీదగా చెన్నై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నామన్నారు క్రైం డీసీపీ లతా మాధురి.

ఆ సెల్ఫీ తో..

అయితే హత్య చేసి పారిపోయిన శివ.. మధ్యలో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు. తాను చేసిన తప్పుకు తన కుటుంబానికి ఎవరు బాధ్యులను చేయొద్దని. ఎవరు వేధించొద్దని అందులో ఉన్న సారాంశం. అంతకుడ్ని ట్రాక్ చేయడంలో ఆ సెల్ఫీ వీడియో కూడా కీలకంగా పనిచేసింది. తెలిసినవాడే హంతకుడని నిర్ధారించి పోలీసులు శివను పట్టుకున్నామన్నారు క్రైం డిసీపీ

పదిహేనేళ్ళ క్రితం.. మిస్డ్ కాల్..

అయితే.. 15 ఏళ్ల క్రితం మిస్డ్ కాల్ తో లక్ష్మి శివకు పరిచయమైంది. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ తో పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఈలోగా ఆన్లైన్ బయటికి అలవాటు పడిన టాటూ శివ.. కోటి రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. మరో 25 లక్షల వరకు అప్పులు కూడా చేశాడు. దీంతో ఆర్థిక భారం, అప్పులోళ్ళ తలనొప్పి నుంచి గటిక్కించేందుకు లక్ష్మీ సహాయాన్ని కోరాడు. కుదరకపోవడంతో ప్లాన్ వేశాడు.. పథకం ప్రకారం.. ఎవరికి అనుమానం రాకుండా ఆటోలో వచ్చి.. ఆటో డ్రైవర్ మొబైల్ తో లక్ష్మి కి కాల్ చేసి.. నమ్మకంగా ఇంటికి వెళ్లి.. రెండు గంటల పాటు ఇంట్లోనే ఉండి.. ఆమెను హత్య చేసి శరీరంపై ఉన్న బంగారం ఇంట్లో ఉన్న నగదును సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు. లక్ష్మి చీటీలు నిర్వహిస్తుండడంతో.. ఆ డబ్బులు కూడా తీసుకొని టోపీ మాస్క్ పెట్టుకొని పారిపోయాడని డిసిపి క్రైం లతా మాధురి తెలిపారు.

అయితే.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన టాటూ శివ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వివాహమై ఇద్దరు పిల్లలు. లక్ష్మితో సన్నిహితం పెంచుకున్నాడు. ఈ విషయంలో గతంలోనూ లక్ష్మీ ఇంట్లో గొడవలు జరిగినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఒక మిస్డ్ కాల్.. అపరిచిత వ్యక్తితో ఇన్స్టా పరిచయం.. ఇప్పుడు లక్ష్మి ప్రాణాల పైకి తెచ్చింది. ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మరోవైపు బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులపాలై డబ్బు కోసం లక్ష్మిని హత్య చేసిన శివ ఇప్పుడు కటకటాల్లోకి వెళ్ళాడు. దీంతో శివ పై ఆధారపడిన ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడినట్టు అయింది. లక్ష్మీ ప్రాణాలకు కోల్పోయింది.. శివ జైలుకెళ్లాడు.. కానీ ఒక చిన్న తప్పు వారిపై ఆధారపడి ఉన్న రెండు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us