అందంలో అప్సరస .. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి మాయం

Rajeev 

1 April 2026

అను ఇమ్మాన్యుయేల్ గుర్తుందా.? తెలుగులో ఈ బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో కట్టిపడేసింది.

ఈ బ్యూటీ తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె 1997 మార్చి 28న అమెరికాలో జన్మించింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో పెరిగింది.

చిన్నతనంలోనే నటనపై ఆసక్తి పెంచుకున్న అను, తన సినీ ప్రస్థానాన్ని బాలనటిగా మొదలుపెట్టింది. అను తొలిసారిగా 2011లో "స్వప్న సంచారి" అనే మలయాళ చిత్రంలో బాలనటిగా కనిపించింది.

ఆ తర్వాత, 2016లో యాక్షన్ హీరో బిజు అనే మలయాళ చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టింది.

అదే సంవత్సరంలో తెలుగులో మజ్ను చిత్రంలో నాని సరసన నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 

తర్వాత ఆమె పవన్ కళ్యాణ్‌తో అజ్ఞాతవాసి,  అల్లు అర్జున్‌తో "నా పేరు సూర్య" వంటి తెలుగు చిత్రాలలో నటించింది, అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేదు.

ప్రస్తుతం అను చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. దాంతో సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతుంది ఈ చిన్నది..