Sensodyne: మీ దంతాల ఏజ్ ఎంతో మీకు తెలుసా..? నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.. కానీ చాలామంది దంతాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేశంలో ప్రతి 10 మందిలో 9 మంది దంత సమస్యలతో బాధపడుతున్నారనే షాకింగ్ నిజాన్ని నిపుణులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా టేక్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ ఓరల్ హెల్త్ అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.
దేశంలో ఓరల్ హెల్త్‌పై అవగాహన కల్పించేందుకు సెన్సోడైన్, TV9 నెట్‌వర్క్ సంయుక్తంగా ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. వరుసగా నాలుగవ సంవత్సరం టేక్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ ఓరల్ హెల్త్ అనే థీమ్‌తో ఈ ప్రత్యేక ప్రచారాన్ని న్యూ ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. దేశంలో ప్రతి 10 మందిలో 9 మంది ఏదో ఒక రకమైన డెంటల్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారని ఈ సందర్భంగా నిపుణులు వెల్లడించారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, దేశవ్యాప్తంగా ఓరల్ హెల్త్ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ఏడాది ఈ ప్రచారాన్ని దేశంలోనే అత్యంత వేగవంతమైన వందే భారత్ రైళ్లతో జోడించడం విశేషం. దీని ద్వారా దేశంలోని ప్రతి మూలకు ఓరల్ హెల్త్ సందేశాన్ని చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రజలు తమ దంతాల వయస్సును తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక QR కోడ్‌ను కూడా విడుదల చేశారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా తమ ఓరల్ హెల్త్ రిపోర్ట్‌ను పొందవచ్చు. హేలియాన్ ఇండియా సీఈఓ కేడార్ లేలే మాట్లాడుతూ.. “సాధారణంగా ప్రజలు నొప్పి భరించలేనంత వరకు డెంటల్ సమస్యలను పట్టించుకోరు. కానీ పెరుగుతున్న ఆయుష్షుతో పాటు దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అందుకే సెల్ఫ్ అవేర్‌నెస్ పెంచేందుకు ఈ రివల్యూషన్ తీసుకొచ్చాం” అని తెలిపారు. అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అశోక్ డోబ్లే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఓరల్ హెల్త్ ప్రాముఖ్యతను వివరించారు.
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు..
అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు
అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం
షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

