ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు
మారుతున్న జీవనశైలితో వృద్ధులలో అయోర్టిక్ స్టెనోసిస్ ప్రమాదకరంగా పెరుగుతోంది. ఇది ప్రాణాంతకమైన "సైలెంట్ కిల్లర్" గుండె సమస్య. శ్వాస ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బైపాస్‌కు బదులుగా కోతలేని టీఏవీఆర్ చికిత్స ద్వారా 90 ఏళ్లు పైబడిన వారికీ సురక్షితంగా చికిత్స చేయవచ్చు. ముందస్తు పరీక్షలు, జాగ్రత్తలు గుండెను కాపాడతాయి.
మారుతున్న జీవనశైలితో గుండెసంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెసంబంధిత వ్యాధులతో అనేకమంది చనిపోతున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో గుండె సంబంధిత సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ప్రధానంగా 60 నుంచి 80 ఏళ్లు దాటిన వారిలో ‘అయోర్టిక్ స్టెనోసిస్’ అనే సమస్య విపరీతంగా పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో గతంతో పోలిస్తే ఈ సమస్యకు సంబంధించిన శస్త్రచికిత్సలు సుమారు 34 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతను ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన కవాటం సన్నబడటాన్ని అయోర్టిక్ స్టెనోసిస్‌గా పిలుస్తారు. ఈ వాల్వు బిగుసుకుపోవడం వల్ల గుండె నుంచి అవయవాలకు రక్తం చేరడం మందగిస్తుంది. ఇది ప్రాణాంతకమైన సమస్య అయినప్పటికీ, ప్రాథమిక దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తున్నారు. మరి ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం ఎలా అంటే.. చిన్నపాటి పనులు చేసినా కూడా కొన్ని లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. కొంచెం దూరం నడిచినా లేదా మెట్లు ఎక్కినా ఊపిరి ఆడకపోవడం, ఆయాసం రావడం, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఛాతిలో బిగుతుగా, నొప్పిగా అనిపించడం, ఏ పనీ చేయకపోయినా విపరీతంగా నీరసంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరో ముఖ్య లక్షణం కాళ్లలో వాపురావడం.. ఇది గుండె పనితీరు మందగిస్తుందని చెప్పడానికి ప్రధాన సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. గతంలో ఈ సమస్యకు బైపాస్ సర్జరీ ఒక్కటే దిక్కు. కానీ వయసు పైబడిన వారు మందులతో నెట్టుకొచ్చేవారు. బైపాస్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ, ఇప్పుడు ట్రాన్స్‌క్యాథర్ అయోర్టిక్ వాల్వు రిప్లేస్‌మెంట్ (TAVR) అనే అత్యాధునిక విధానం అందుబాటులోకి వచ్చింది. దీనిలో కోత, కుట్లు లేకుండానే స్టంట్ మాదిరిగా కొత్త వాల్వును అమర్చుతారు. 90 ఏళ్లు దాటిన వారికి కూడా ఈ చికిత్స ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు. కేవలం 3 నుండి 5 రోజుల్లోనే రోగి డిశ్చార్జి అయి తన పనులు తాను చేసుకోగలుగుతారు. లక్షణాలు కనిపించే వరకు ఆగకుండా 50 ఏళ్లు దాటిన వారు ఏటా ఒకసారి ఈసీజీ , 2డీ ఎకో పరీక్షలు చేయించుకోవడం మంచిందని సూచిస్తున్నారు. నిత్యం రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం, ఆహారంలో ఉప్పు తగ్గించడం, తేలికపాటి నడక వంటి అలవాట్లు గుండెను కాపాడుతాయి. గొంతు లేదా నోటి ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఇప్పుడు ఈ తరహా అత్యాధునిక గుండె చికిత్సలకు కేంద్రంగా మారుతోంది. ఏటా నగరంలో సుమారు 400 వరకు టీఏవీఆర్ సర్జరీలు జరుగుతుండటం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
పింక్ సాల్ట్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము.. కన్నుమూసి తెరిచే లోపే ప్రాణాలు తీసేస్తుంది!
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

