AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసుకుని తిన్నారు.. ఆ తర్వాత..

ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసుకుని తిన్నారు.. ఆ తర్వాత..

Phani CH
|

Updated on: May 09, 2026 | 12:29 PM

Share

అనకాపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ఆరోగ్య చిట్కాలను నమ్మి, ఉమ్మెత్త ఆకులను కూరగా వండుకు తిన్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తెలియని మొక్కలను ఆహారంగా తీసుకోకూడదని, నిపుణుల సలహా లేకుండా సోషల్ మీడియా చిట్కాలను గుడ్డిగా నమ్మకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ వార్త, లేదా ప్రతి సమాచారం పూర్తిగా నిజం కాదని రుజువు చేసే మరో ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. చాలామంది సోషల్‌ మీడియాలో వచ్చే ఆరోగ్యానికి సంబంధించినదైనా, వంటింటి చిట్కాలు అయినా, అందానికి సంబంధించిన టిప్స్‌ అయినా వాటిని విపరీతంగా నమ్మేసి వెనుకా ముందూ ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు. ఆనక లేనిపోని అనర్థాలు కొనితెచ్చుకుంటారు. సరిగ్గా అదే జరిగింది ఈ ఘటనలో. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం ప్రాణాంతకంగా మారుతోంది. ఆరోగ్య సూత్రాల పేరుతో వచ్చే వీడియోలను గుడ్డిగా నమ్మితే ఎంతటి ముప్పు వాటిల్లుతుందో అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం ఘటన నిరూపిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉమ్మెత్త ఆకులను కూరగా వండుకుని తిని, ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. అమ్మవారి జాతర కోసం హైదరాబాద్ నుండి సొంత ఊరైన ఎర్రంపాలెంకు వచ్చిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి అనే నలుగురు.. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోను చూశారు. అందులో ఉమ్మెత్త కూర ఆరోగ్యానికి మంచిదని చెప్పడంతో, అది నిజమని నమ్మి సోమవారం ఆ కూరను వండుకుని తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వారిని తక్షణమే కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్య నిపుణుల ప్రకారం..ఉమ్మెత్త అత్యంత విషపూరితమైన మొక్క. ఇందులో ఉండే ఆల్కలాయిడ్స్ నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేస్తాయి. దీనికి ప్రత్యేకమైన విరుగుడు ఉండదని, విషం రక్తంలో కలిస్తే ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుకే, తెలియని మొక్కలను, ఆకులను ఆహారంగా తీసుకోవద్దని, సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను… నిపుణుల సలహా లేకుండా పాటించవద్దని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మతిమరుపు… గుండెజబ్బుకు సంకేతమా ?? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు !!

TVK Vijay: మేనిఫెస్టోలోని హామీలన్నీ విజయ్ తీర్చగలడా ??

Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??

Godari Gattupaina Review: డీసెంట్ ఎంటర్టైనర్ గోదారి గట్టుపైన రివ్యూ.. ఎలా ఉందంటే ??

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం

Published on: May 09, 2026 12:28 PM
Follow Us