Sathi Leelavathi Movie Review: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా.. సతీ లీలావతి రివ్యూ.. ఎలా ఉందంటే ??
"సతీ లీలావతి" చిత్రం లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన తొలి సినిమా. భార్యాభర్తల మధ్య విభేదాలు, విడాకులు కోరుకునే భర్త కథాంశం. లావణ్య, దేవ్ మోహన్ నటన పర్వాలేదు. అయితే దర్శకుడు తాతినేని సత్య కథనాన్ని ఆసక్తికరంగా నడిపించలేకపోయారు. ఒకే గదిలో సాగే కథ, బలహీనమైన ద్వితీయార్ధం నిరాశపరిచాయి. మొత్తంమీద, ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన తొలి చిత్రం ‘సతీ లీలావతి’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. దేవ్ మోహన్ హీరోగా నటించారు. ఈ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. సతీ లీలావతి కథ విషయానికి వస్తే.. లీలావతి అలియాస్ లావణ్య త్రిపాఠి ఓ స్టార్ డైరెక్టర్. చిన్నతనంలో తల్లిదండ్రులైన నరేష్, పవిత్ర మధ్య చూసిన గొడవల ప్రభావం వల్ల ఆమెకు కొన్ని మానసిక భయాలు ఏర్పడతాయి. ఆ సమస్య నుంచి బయటపడే క్రమంలో రామ్ సేతు అలియాస్ దేవ్ మోహన్ అనే సైకాలజిస్ట్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారి, తండ్రిని ఒప్పించి మరీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న మూడేళ్ల తర్వాత, రామ్ సేతు తనకు విడాకులు కావాలని అడుగుతాడు. తాను నర్సు నికోలా సెబాస్టియన్ అలియాస్ మడోనా సెబాస్టియన్‌తో ప్రేమలో ఉన్నానని, విడాకులు ఇస్తే ఆమెతో కొత్త జీవితం మొదలుపెడతానని చెబుతాడు. ఆ మాటలతో కోపంతో రగిలిపోయిన లీలావతి అతన్ని చితకబాది ఇంట్లోనే బంధిస్తుంది. ఆ తర్వాత వారి బంధం ఏ మలుపు తిరిగింది, మధ్యలో వచ్చిన ఇతర పాత్రల నేపథ్యం ఏంటి, చివరకు వారు విడిపోయారా లేదా కలిశారా అనేది మిగతా కథ. సినిమా ప్రారంభం కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవ, హీరోని ఇంట్లో బంధించడం వంటివి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ మొత్తం దాదాపుగా ఒకే గదిలో సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. మధ్యలో వచ్చే లాయర్ కామెడీ కూడా అంతగా పండలేదు. ఇంటర్వెల్ సమయానికి కథ కాస్త వేగవంతం అయినట్లు అనిపించినా.. అందులో ఎలాంటి ఉత్కంఠ ఉండదు. ఇక సెకండాఫ్ అయితే మరీ గందరగోళంగా సాగుతుంది. దొంగ ట్రాక్, హీరో తప్పించుకునే ప్రయత్నాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాలు కేవలం టైమ్ పాస్ కోసం ఇరికించినట్లు ఉంటాయి. క్లైమాక్స్‌ను ఒక గేమ్ లాగా వెరైటీగా ప్లాన్ చేసినా అది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని తెరపై ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయాయి. ఈ తరహా కథ చెప్పాలంటే చాలా వినోదాత్మకంగా అయినా ఉండాలి లేదంటే ఎమోషనల్ పద్దతైనా ఉండాలి. కానీ దర్శకుడు ఈ రెండింటికి మధ్యలో ఊగిసలాడాడేమో అనిపించింది సినిమా చూశాక. లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి చాలా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకుంది. భర్తపై కోపం చూపించే సన్నివేశాల్లో ఆమె నటన నవ్విస్తుంది. దేవ్ మోహన్ పాత్ర ఎక్కువ భాగం ఒకే చోట కుర్చీకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. మడోన్నా సెబాస్టియన్, నరేష్, వీటీవీ గణేష్ తమ పాత్రల పరిధి మేర పర్వాలేదనిపించారు. సప్తగిరి, తాగుబోతు రమేష్, జాఫర్ అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు.మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం బాగుంది.. పాటలు బాగానే ఉన్నాయి. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్లుగా ఓ మోస్తరుగా ఉన్నాయి. ఎడిటింగ్ అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తీసేసినా నష్టం అయితే కనిపించదు. చాలా కాలం విరామం తర్వాత దర్శకత్వం వహించిన సత్య తాతినేని ఎంచుకున్న కథలో కొత్తదనం అయితే కనిపించదు. కథనాన్ని అనవసరంగా సాగదీయడం వల్ల సినిమా కూడా వీకైంది. నిర్మాణ విలువలు కథకు సరిపోయేలా ఉన్నాయి.ఓవరాల్‌గా చెప్పాలంటే.. సతీ లీలావతి.. ఇంకాస్త ఆకట్టుకుని ఉండాల్సింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Godari Gattupaina Review: డీసెంట్ ఎంటర్టైనర్ గోదారి గట్టుపైన రివ్యూ.. ఎలా ఉందంటే ??
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

