AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godari Gattupaina: అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న గోదారి గట్టు పైన.. చిత్రం

Godari Gattupaina: అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న “గోదారి గట్టు పైన..” చిత్రం

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: May 10, 2026 | 5:49 PM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డ్రై పీరియడ్ కొనసాగుతుండగా, ఈ వారం పలు కొత్త తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన', లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ చిత్రాలు సినీ పరిశ్రమలో మందగమనాన్ని అధిగమించి ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

బాక్సాఫీస్ దగ్గర డ్రై పీరియడ్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి.. పోయే సినిమాలు పోతూనే ఉన్నాయి కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ఈ క్రమంలోనే ఈ వారం కూడా మూడు నాలుగు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి ఏంటా మూవీస్.. అందులో ఆడియన్స్ మైండ్ గ్రాబ్ చేసే సత్తా వేటికి ఉంది..? ప్రతీవారం మాదిరే ఈ వారం కూడా సినిమాలు వస్తున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా గోదారి గట్టుపైన. మేం ఫేమస్ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ఆకట్టుకున్న సుమంత్ ప్రభాస్.. కాస్త గ్యాప్ తీసుకుని గోదారి గట్టుపైన సినిమాతో వస్తున్నారు. డిఫెరెంట్ ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేసారు దర్శక నిర్మాతలు. సుభాష్ చంద్ర తెరకెక్కించిన గోదారి గట్టుపైన సినిమాలో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. సమ్మర్ కూల్ ఎంటర్‌టైనర్ ప్రమోషన్స్‌తో గోదావరి నేపథ్యంలో వస్తుంది ఈ చిత్రం. ఈ సినిమాతో పాటు మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సతీ లీలావతి మే 8నే వస్తుంది. తాతినేని సత్య తెరకెక్కించి సతీ లీలావతి పూర్తిగా భార్యా భర్తల మధ్య జరిగే గిల్లికజ్జాల నేపథ్యంతో వస్తుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.. ఇక మే 8నే రాబోతున్న మరో సినిమా రేజర్. విభిన్నమైన సినిమాలు చేసే రవిబాబు ఈ మూవీకి దర్శకుడు. హై రేంజ్ వయోలెన్స్‌తో వస్తుంది రేజర్. ఈ మూడింటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఇదే వారం వస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

CM Vijay: ‘వావ్’ అనిపించిన సీఎం విజయ్ తొలి ప్రసంగం

ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !

‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే

ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు

Follow Us