Prabhas: ప్రభాస్ ఏంటి.. ఇలా బుక్ అయిపోయారు..?
ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నా, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నారు. దీంతో షెడ్యూల్స్ గందరగోళంగా మారి, అన్ని సినిమాల విడుదల తేదీలు ఆలస్యం అవుతున్నాయి. ఆయన ఎంత కష్టపడుతున్నా, బాహ్య పరిస్థితులు సహకరించకపోవడంతో ప్రభాస్ సినిమా రిలీజ్‌లు సందిగ్ధంలో పడ్డాయి.
పాపం ప్రభాస్ ఎంత ప్రయత్నించినా.. చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా సహకరించాలి కదా.. అప్పుడే ఆయన అనుకున్నది చేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితులు బాగా పగబట్టేసాయి. అందుకే అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లుగా మారిపోతుంది పరిస్థితి. ఇంతకీ ఏ విషయంలో ప్రభాస్ ఇంతగా ఇబ్బంది పడుతున్నారు..? అసలేం జరుగుతుంది..? రాజా సాబ్ అయిపోయిన తర్వాత ప్రభాస్ ఓ మాట చెప్పారు.. ఇకపై ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే.. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంది అని..! కానీ ఆయన చెప్పినంత ఈజీగా సిచ్యువేషన్స్ ఉండవు కదా.. అందుకే కష్టమే అయినా ఇప్పుడు కూడా మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నారు రెబల్ స్టార్. ఒకేసారి 3 సినిమాలు చేస్తున్నపుడు.. వద్దన్నా ప్రభాస్ మళ్లీ సేమ్ కన్ఫ్యూజన్ స్టేట్‌లోకి వెళ్లిపోతున్నట్లేక కనిపిస్తుంది. రెండేళ్లుగా సెట్స్‌పైనే ఉన్న హను రాఘవవపూడి ఫౌజీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 2026లో పక్కానే అంటున్నారు కానీ నమ్మకంగా చెప్పట్లేదు. మరోవైపు కల్కి 2, స్పిరిట్‌తో కలిసి ఫౌజీ చేస్తున్నారు ప్రభాస్. కల్కి 2 షూటింగ్ కూడా నడుస్తూనే ఉంది కానీ వాళ్లు కూడా డేట్ చెప్పట్లేదు. నాగ్ అశ్విన్‌ను అడిగితే.. అందరి డేట్స్ కుదరాలి.. షూట్ అయిపోవాలి.. అప్పుడు చెప్తాం కంగారేం లేదు అంటున్నారు. మరోవైపు స్పిరిట్ షూట్‌కు సందీప్ పక్కా ప్లాన్ వేసుకున్నా.. మిగిలిన వాటి వల్ల ఈ షెడ్యూల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. దాంతో స్పిరిట్ చెప్పినట్లుగా మార్చి 5, 2027న వచ్చేది అనుమానమే. ఫౌజీని ముందు 2026 దసరా అన్నారు.. పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్‌కు వెళ్లేలా కనిపిస్తుంది. మరోవైపు కల్కి 2 డేట్‌పైనా క్లారిటీ లేదు.. చెప్పిన స్పిరిట్ ఏమో కన్ఫ్యూజన్‌లో ఉంది. మొత్తానికి ప్రభాస్ తన వరకు ఎలాంటి శక్తివంచనా లేకుండా కష్టపడుతున్నా.. సిచ్యువేషన్స్ కారణంగా తిప్పలు తప్పట్లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
‘ఐ స్ట్రోక్’ గురించి తెలుసా? నిర్లక్ష్యం చేస్తే అంధత్వమే
ఈ సైలెంట్ కిల్లర్‌తో జాగ్రత్త.. ముఖ్యంగా వృద్ధులు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

