జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో నిందితుల కోసం తెలంగాణ పోలీసులు నేపాల్ సరిహద్దుకు చేరుకున్నారు. నగదు, బంగారంతో పారిపోయిన నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి వేట తీవ్రతరం చేశారు. నిందితులు ప్లాన్ ప్రకారం ఇంట్లో చేరినట్లు గుర్తించిన పోలీసులు, ఆరు కీలక ఆధారాలు, నిందితురాలు కల్పన కాల్ డేటాతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.