Dhudrandhar 2: 9 ఏళ్ళ నాటి బాహుబలి 2 రికార్డును తుడిచిపెట్టిన ధురంధర్..
ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టిస్తోంది. తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న బాహుబలి 2 నార్త్ అమెరికా రికార్డును కేవలం పది రోజుల్లోనే బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రూ.2000 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. ఇండియాలోనూ రూ.1000 కోట్ల మార్కును దాటి బాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోసింది.
ఓ రికార్డ్ వారానికి పోతుంది.. ఓ రికార్డు నెలకు పోతుంది.. మరో రికార్డు ఏడాదికి పోతుంది.. చివరికి ఏ రికార్డైనా ఎప్పుడో ఓసారి పోవాల్సిందే.. అది ట్రేడ్ ధర్మం. ధురంధర్ 2 కూడా ఇప్పుడిదే చేసింది. దీని దూకుడు మామూలుగా లేదిప్పుడు. దశాబ్దకాలంగా పదిలంగా ఉన్న బాహుబలి 2 రికార్డులను సైతం తుడిచేసాడు ధురంధరుడు. మరి ధురంధర్ 2 క్రియేట్ చేసిన ఆ కొత్త రికార్డ్ ఏంటి..? నార్త్ అమెరికాలో తొమ్మిదేళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డ్ చెరిగిపోయింది. 21 మిలియన్ డాలర్ల రికార్డును.. ధురంధర్ 2 కేవలం 10 రోజుల్లోనే 22 మిలియన్లతో బద్దలు కొట్టింది. బాలీవుడ్ పనైపోయింది అని తక్కువంచనా వేసిన వాళ్ళందరికీ ఈ సినిమా ఒక రేంజ్‌లో సమాధానం చెబుతుంది. ఇంటా బయటా రికార్డుల వర్షం కురిపిస్తుంది ధురంధర్ 2. వరల్డ్ వైడ్‌గా వసూళ్లు 1300 కోట్లు దాటేయగా.. త్వరలోనే 2000 కోట్ల మైలురాయి అందుకోవడం పెద్ద కష్టమేం కాదనిపిస్తుంది. అంతేకాదు కేవలం ఇండియాలోనే 1000 కోట్లు కొల్లగొట్టిన సినిమాగా చరిత్ర సృష్టించి.. బాక్సాఫీస్‌కు కొత్త లెక్కలు నేర్పిస్తున్నాడు ధురంధరుడు. డిసెంబర్‌లో వచ్చిన ఫస్ట్ పార్ట్ ఇండియాలో 900 కోట్ల దగ్గరే ఆగింది. ఎలా చూసుకున్నా ధురంధర్ 2 సక్సెస్‌తో బాలీవుడ్ మళ్లీ బాక్సాఫీస్ రేసులోకి రారాజులా తిరిగొచ్చినట్లే. రోజుకో కొత్త రికార్డు పుట్టుకొస్తున్న ఈ క్రమంలో.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో అనేది ఊహకు కూడా అందట్లేదు. ప్రస్తుతానికి అయితే రికార్డులన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ ధురంధర్ అంతే..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్
Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్
Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..
Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే
ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు..
అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు
అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం
షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

