AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?

Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 5:04 PM

Share

సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలకు మినహాయింపులు ఉండవు. కానీ 'వారణాసి' చిత్రం కోసం మహేష్ బాబుకు జక్కన్న ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నారు. వెకేషన్లకు అనుమతిస్తూనే, సినిమాను మాత్రం జెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల లక్ష్యంగా, ఆగస్టు నాటికి మహేష్ షూటింగ్ ముగించి, ప్రమోషన్లకు సిద్ధమవుతున్నారు. ఇది రాజమౌళి శైలిలో అరుదైన మార్పు.

రాజమౌళి కాంపౌండ్‌లో అడుగుపెడితే హీరోలంతా బయటి ప్రపంచాన్ని మర్చిపోవాల్సిందే అంటుంటారు.. కానీ వారణాసి కోసం జక్కన్న తన కఠినమైన రూల్స్ అన్నీ పక్కనబెట్టేసి షాకిస్తున్నారు. ఏకంగా ఫ్యామిలీ వెకేషన్స్‌కు స్పెషల్ పర్మిషన్లు ఇస్తూనే.. జెట్ స్పీడ్‌తో సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. మహేష్ కోసమే దర్శక ధీరుడు ఎందుకు మారిపోయారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. జక్కన్న హీరోలకు ఇంతకుముందు ఏ సినిమాలకు లేని విధంగా వారణాసి విషయంలో మహేష్ బాబుకు ప్రత్యేకమైన మినహాయింపులు లభిస్తున్నాయి. షూటింగ్ మొదలైన తర్వాత ఇప్పటికే రెండుసార్లు హాయిగా వెకేషన్‌కు వెళ్లి వచ్చిన సూపర్ స్టార్.. తాజాగా మరోసారి తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌ ఎంజాయ్ చేయడానికి గ్రాండ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ మొత్తం ఏకధాటిగా షూటింగ్ చేసి.. మే నెలలో ఎండలు ముదిరితే టీమ్ మొత్తానికి చిన్న బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు మేకర్స్. గతేడాది కూడా ఎండల కారణంగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్లే.. ఈసారి కూడా షూట్‌కు బ్రేక్ ఇచ్చి జక్కన్న సైతం తన ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇది నిజంగా పెద్ద మార్పే. హీరోలకు ఇన్ని వెకేషన్స్, షూటింగ్‌కు ఇన్ని బ్రేకులు ఇస్తున్నా.. జక్కన్న కెరీర్‌లో ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా షూట్ జరుపుకుంటున్న సినిమా వారణాసి కావడం విశేషం. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఆగస్ట్ నాటికే మహేష్ తన పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని వారణాసి సెట్స్ నుంచి ఫ్రీ అయిపోతారని తెలుస్తుంది. అక్టోబర్ నుంచి కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు మొదలుపెట్టి.. జనవరి నాటికి ఫుల్ ప్రొడక్ట్ రెడీ చేసేలా పక్కా స్కెచ్ వేశారు. ఆ తర్వాత ఏకంగా 3 నెలల పాటు గ్లోబల్ రేంజ్‌లో ప్రమోషన్స్ చేసి.. ఏప్రిల్ 7, 2027న చెప్పిన టైమ్‌కు వారణాసితో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దండయాత్ర చేయడానికి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్లాన్ బాగుంది.. అది అలాగే అప్లై అవుతుందేమో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే

TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్

Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..

షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..

VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్‌ వార్నింగ్

Published on: Mar 31, 2026 04:56 PM
Follow Us