షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..
బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ డిఘా సముద్రంలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. షూటింగ్ అనంతరం ఒంటరిగా విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. రక్షణ సిబ్బంది కాపాడినా ఫలితం లేకపోయింది. ఆయన మరణం బెంగాలీ చిత్ర పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హీరో రాహుల్ అరుణోదయ్ బెనర్జీ ప్రమాదవశాత్తూ సముద్రంలో పడి మరణించడం ఇప్పుడు ఫిల్మ్ ఫెటర్నిటీలో సంచలనంగా మారింది. అందర్నీ షాక్‌కు గురిచేస్తోంది. సీరియల్ షూటింగ్ లో భాగంగా.. మార్చి 29న పశ్చిమ బెంగాల్‌లోని డిఘ ప్రాంతానికి వెళ్లిన రాహుల్ అరుణోదయ బెనర్జీ.. తన చిత్రీకరణ ముగిశాక కాలక్షేపం కోసం ఒంటరిగా సముద్రంలో విహారానికి వెళ్లారు. అయితే పడవలో ప్రయాణిస్తున్న క్రమంలోనే ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. ఇది గమనించిన రక్షణా సిబ్బంది వెంటనే ఆయన్ను బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లనప్పటికీ.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుకు సమీపంలోని తల్సారి బీచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాహుల్ బెనర్జీకి భార్య ప్రియాంక సర్కార్, ఒక కుమారుడు ఉన్నారు. ఇక మరో వైపు హీరో మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన నటుల్లో రాహుల్ ఒకరు.. ఆయన ఇక లేరనే వార్త తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఆయన కుటుంబానికి మమతా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన మరణం బెంగాలీ చిత్రపరిశ్రమకు తీరని లోటంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. రాహుల్ అరుణోదయ్ బెనర్జీ 1983 అక్టోబర్ 16న జన్మించారు. చిరోదిని తుమీ జే అమర్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమయ్, నా హణ్యతే, కగోజెర్ బో వంటి పలు సినిమాలు చేశారు. సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్ వార్నింగ్
Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?
Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

