AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?

Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?

Phani CH
|

Updated on: Mar 31, 2026 | 4:31 PM

Share

మహిళల వస్త్రధారణపై కొనసాగుతున్న వివాదంపై బిగ్ బాస్ దివ్యవేల మాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు డ్రెస్సింగ్ విషయంలో పరిమితులుండాలని, నిండుగా దుస్తులు ధరిస్తేనే గౌరవం, అందం పెరుగుతాయని అభిప్రాయపడింది. సౌకర్యంగా లేని దుస్తుల వల్ల లైంగిక దాడులు జరగవచ్చని, నిండుగా ఉండే బట్టలే మహిళలకు రక్షణ అని ఆమె నొక్కి చెప్పింది.

ఆడవాళ్ల దుస్తుల విషయంపై రగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పుడెప్పుడో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ను కొందరు వ్యతరేకిస్తే.. మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన దివ్వెల మాధురి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. అలా తాజాగా ఓ టాక్ షోకు హాజరైన ఆమె మహిళల వస్త్రధారణ విషయంపై స్పందించింది. డ్రెస్సింగ్ విషయంలో అమ్మాయిలకు లిమిట్స్ ఉండాలంటూ ఆ టాక్‌ షోలో చెప్పుకొచ్చింది. అంతేకాదు అమ్మాయిల వస్త్రధారణ విషయంలో.. గతంలో తాను శివాజీకి మద్దతు తెలుపుతూ ఒక వీడియో కూడా చేశానని చెప్పకొచ్చింది. మనం వేసుకునే దుస్తులను బట్టి సమాజంలో లైంగిక దాడులు జరుగుతున్నాయా? అంటే తాను ఔననే అంటానని సదరు టాక్‌ షో వేదికగా చెప్పుకొచ్చింది మాధురి. సౌకర్యంగా లేని బట్టలను వేసుకెళ్లి అందరూ చూస్తుండగా సర్దుకోవడం కంటే నిండుగా దుస్తులు వేసుకొని వెళ్లడం మంచిదంటూ చెప్పుకొచ్చింది. అమ్మాయిలకు అందం అనేది ఎక్స్ పోజింగ్ చేస్తే రాదని.. ఒంటిపై నిండుగా బట్టలు వేసుకున్నప్పుడే అమ్మాయిలకు అందం రెట్టింపు అవుతుందంటూ చెప్పుకొచ్చింది. మనం నిండుగా దుస్తులు ధరిస్తేనే.. అప్పుడే గౌరవం కూడా పెరుగుతుందంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana Rains: తెలంగాణకు మూడు రోజుల వర్షసూచన

అమ్మవారి విగ్రహానికి చెమటలు.. పూనకాలతో ఊగిపోయిన భక్తులు

అద్భుతం.. రామాలయంలో హనుమంతుడు ప్రత్యక్షం

Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??

షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌

Follow Us