Gold Price Today: పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ధర ఎంతంటే ??
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నాయి. ఈ భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో మార్చి 31న బంగారం ధర పెరగగా, వెండి ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోనూ విలువైన లోహాల రేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొనుగోలుకు ముందు నేటి ధరలను పరిశీలించడం మంచిది.
బంగారం, వెండి ధరలు తీవ్ర ఒదుడుకులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం విలువైన లోహాల మార్కెట్ ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ప్రభావం అటు చమురు, ఇంధన రంగాలపైన, ఇటు బంగారం, వెండిలాంటి విలువైన లోహాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో మార్చి 31 మంగళవారం బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,030 పెరిగి రూ.1,49,250 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.950లు పెరిగి రూ.1,36,850 పలుకుతోంది. వెండి మాత్రం కేజీకి రూ.5000 తగ్గి రూ.2,50,000 పలుకుతోంది. దేశంలోని వివధ నగరాల్లో మార్చి 31, మంగళవారం బంగారం వెండిధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,440 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,37,000 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,290 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,130 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.1,36,700 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,290 ఉంటే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,850 లు పలుకుతోంది. వెండి ధర కిలోకి రూ.2,50,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లేముందు ధరలు మరోసారి చెక్‌చేసుకొని వెళ్తే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

