AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌

షాకింగ్‌ న్యూస్‌.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాలు బంద్‌

Phani CH
|

Updated on: Mar 31, 2026 | 4:16 PM

Share

తెలంగాణలో మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు లాభాల మార్జిన్‌ను తగ్గించడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో కోడి మాంసం లభ్యత కష్టమై, సామాన్యులు, హోటల్ వ్యాపారులు ఇబ్బందులు పడనున్నారు. న్యాయమైన మార్జిన్ కోసం పోరాటం ఆగదని అసోసియేషన్ స్పష్టం చేసింది.

తెలంగాణలో మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్‌ను భారీగా తగ్గించి నష్టాల్లోకి నెడుతున్నాయని ఆరోపిస్తూ, తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్ నిర్ణయం తీసుకుంది. ఈ నిరసనలో భాగంగా ఘట్‌కేసర్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు శనివారం గురుకుల్ కళాశాల మైదానంలో సమావేశమై తమ మద్దతు ప్రకటించారు. పౌల్ట్రీ కంపెనీలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తమకు రావాల్సిన లాభాలను తగ్గించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. పెరిగిన నిర్వహణ ఖర్చుల దృష్ట్యా, తగ్గించిన మార్జిన్‌తో వ్యాపారం చేయడం సాధ్యం కాదని వారు స్పష్టం చేశారు. తమకు రావాల్సిన మార్జిన్‌ను తిరిగి సవరించి, న్యాయం చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న చికెన్ సెంటర్లు పాల్గొంటాయని, ఫలితంగా ఏప్రిల్ మొదటి వారం నుంచి చికెన్ లభ్యత కష్టతరం కానుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆదివారాల్లో చికెన్‌పై ఆధారపడే సామాన్యులు, హోటల్ వ్యాపారులకు ఈ బంద్ పెద్ద ఇబ్బందిగా మారనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Published on: Mar 31, 2026 04:03 PM
Follow Us