AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

Phani CH
|

Updated on: Mar 30, 2026 | 6:30 PM

Share

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఒక కుటుంబం తాము పెంచుకుంటున్న గోమాత 'లక్ష్మి'కి అత్యంత వైభవంగా సీమంతం నిర్వహించింది. కన్నబిడ్డలా చూసుకుంటున్న లక్ష్మి గర్భం దాల్చడంతో, సాంప్రదాయ పద్ధతిలో పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ వేడుక చేశారు. కుటుంబ సభ్యుల ప్రేమ, జంతువుల పట్ల వారి అపారమైన అనురాగం ఈ అరుదైన వేడుకలో ప్రస్ఫుటించింది. స్థానికులు దీనిని ఎంతగానో అభినందించారు.

హిందూ సంప్రదాయంలో ఆవును గోమాతగా భావిస్తారు. ప్రత్యేకంగా పూజిస్తారు. కొందరు తాము పెంచుకునే పశువుల పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తారు. వాటిని కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఈ క్రమంలో మూగజీవాల పట్ల ఉన్న మమకారాన్ని చాటుకుంటూ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఒక కుటుంబం చేసిన వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాము కన్నబిడ్డలా పెంచుకుంటున్న ‘లక్ష్మి’ అనే ఆవుకు అత్యంత వైభవంగా సీమంతం వేడుకను నిర్వహించింది. ఈ కుటుంబం లక్ష్మిని చిన్నప్పటి నుంచి ఇంటి వద్దే అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఏటా లక్ష్మి పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుతూ తమ కుటుంబంలో ఒక సభ్యురాలిగా చూసుకుంటోంది. ప్రస్తుతం ఆ గోమాత గర్భం దాల్చడంతో, తమ ఇంటి ఆడపడుచుకు చేసినట్లే శాస్త్రోక్తంగా సీమంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో గోమాతను అందంగా అలంకరించి, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య, ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ వేడుకకు పెద్ద మొత్తంలో ముత్తయిదువలు హాజరయ్యారు. వారందరికీ స్వీట్లు, సారెతో పాటు పట్టుచీరలను కూడా పంపిణీ చేశారు. అనంతరం బంధుమిత్రులందరికీ విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇటువంటి వేడుకను ఒక ఆవుకు భక్తిశ్రద్ధలతో చేయడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. జంతువుల పట్ల వారికి ఉన్న అపారమైన ప్రేమను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ అరుదైన సీమంతం వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలిరావడం విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us