AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

Phani CH
|

Updated on: Mar 30, 2026 | 6:34 PM

Share

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. బిస్కెట్లలో నిషేధిత రసాయనాలు, కుళ్ళిన గుడ్లు, అపరిశుభ్రమైన పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరంగా ఉన్న ఈ కల్తీ కేంద్రంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆహార భద్రతపై రాజీ పడబోమని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటన నగరంలో ఆహార నాణ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.

భాగ్యనగరవాసులకు అత్యంత ఇష్టమైన ఉస్మానియా బిస్కెట్ల తయారీలో జరుగుతున్న ఘోరాలు అంబర్‌పేట్ వేదికగా వెలుగులోకి వచ్చాయి. అంబర్‌పేట్‌లోని ఒక బిస్కెట్ తయారీ కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బిస్కెట్లు ఆకర్షణీయమైన రంగులో కనిపించడం కోసం సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, నిషేధిత కెమికల్స్‌తో రంగులు అద్దుతున్నట్లు తనిఖీల్లో తేలింది. అంతేకాదు, బిస్కెట్ల తయారీలో కుళ్ళిపోయిన, నాసిరకం గుడ్లను వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు షాక్‌కు గురయ్యారు. ఫ్యాక్టరీ ప్రాంగణమంతా అత్యంత అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా, కనీస ఆరోగ్య ప్రమాణాలు పాటించకుండా తయారీ సాగిస్తున్నారు. ఈ నాసిరకం బిస్కెట్ల వల్ల ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నగరవ్యాప్తంగా ఆహార భద్రతపై రాజీ పడేది లేదని, ఇలాంటి కల్తీ కేంద్రాలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఉదంతంతో హైదరాబాద్‌లో తినుబండారాల నాణ్యతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Follow Us