AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్

ఒక్క పాటతో రేంజ్ మారిపోతుందిగా.. వాట్ ఏ ప్లాన్

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 5:12 PM

Share

మీడియం రేంజ్ సినిమాలకు బ్రహ్మాస్త్రంగా నిలుస్తున్న సింగిల్ హిట్ సాంగ్ ఫార్ములాపై ఈ కథనం. ఒక్క పాటతో సినిమాపై అంచనాలు ఎలా పెంచుతున్నారు, సోషల్ మీడియా, యూట్యూబ్‌ను ఎలా వాడుకుంటున్నారు అనే దానిపై దృష్టి సారించింది. 'బైకర్', 'డెకాయిట్', 'నాగబంధం', 'రాకాస' వంటి చిత్రాల విజయగాథలను ఉదాహరణలుగా వివరిస్తూ, ఈ వ్యూహం సినిమా ప్రమోషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడిస్తుంది.

మీడియం రేంజ్ సినిమాల్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడానికి.. మేకర్స్ వాడేస్తున్న బ్రహ్మాస్త్రం సింగిల్ హిట్ సాంగ్ ఫార్ములా. రిలీజ్‌కు ముందే తమ సినిమాలపై అంచనాలను పెంచేస్తూ.. సోషల్ మీడియాను, యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేస్తున్నారు వాళ్లు. మరి ఈ సింగిల్ హిట్ సాంగ్ ఫార్ములా అప్లై అయిన ఆ సినిమాలేంటో చూద్దామా..? బైకర్ నుంచి విడుదలైన ఈ ఒక్కపాట సినిమాపై ఆసక్తి పెంచేసింది. మాళవిక నాయర్ అందాలు, శర్వా డాన్స్ మూవ్స్ అంచనాలు పెంచేశాయి. దీని తర్వాతే బైకర్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. అలాగే అడివి శేష్ డెకాయిట్ సినిమాలోని చిచ్చుబుడ్డి పాట నెట్టింట దుమ్ము రేపుతుండగా.. ఫస్ట్ టైమ్ శేష్ తన మాస్ స్టెప్పులతో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. భారీ సినిమాలకే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న నాగబంధం సినిమాకు కూడా ఇలాంటి మ్యూజిక్ స్ట్రాటజీనే పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన నమోరే పాట శ్రోతలను కట్టిపడేయడమే కాకుండా.. అసలు కంటెంట్ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీని రేకెత్తిస్తూ సినిమా బజ్‌ను అమాంతం పెంచేసింది. ప్రమోషన్స్‌లో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని ఫిక్స్ అయిన రాకాస మేకర్స్.. స్నేక్ డాన్స్ అంటూ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్‌తో అదరగొట్టారు. ఇందులో నిర్మాత నిహారిక స్టెప్పులేయడంతో.. ఒక్కసారిగా ఈ మీడియం రేంజ్ సినిమాకు కూడా యూత్‌లో మంచి క్రేజ్ వచ్చేసింది. ఏప్రిల్ 3న విడుదల కానుంది ఈ చిత్రం. మొత్తానికి ఇలా ఒక్క పాటతో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్

Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..

Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?

ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే

TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్

Follow Us