AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్

Peddi: అందర్నీ కార్నర్ చేస్తున్న రామ్ చరణ్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 5:10 PM

Share

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా టాలీవుడ్ రిలీజ్ డేట్లను తారుమారు చేస్తోంది. ఏప్రిల్ 30న 'పెద్ది' విడుదల అవుతుండటంతో, ఇతర నిర్మాతలు తమ చిత్రాలను వాయిదా వేసుకుంటున్నారు. అఖిల్ 'లెనిన్' మే 1 నుండి జూన్ 26కి వాయిదా పడగా, తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' పరిస్థితి కూడా డైలమాలో ఉంది. ఒక్క 'పెద్ది' ప్రభావంతో అనేక సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాల్సి వస్తోంది.

టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా రిలీజ్ డేట్ల కన్ఫ్యూజన్ కనిపిస్తోందిప్పుడు.. ఒకే ఒక్క సినిమా దెబ్బకు చాలా సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారవుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం మిగిలిన మేకర్స్ అంతా తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మరి పెద్ది దెబ్బకు డేట్స్ మార్చుకుంటున్న ఆ మూవీస్ ఏంటి..? ఏప్రిల్ 30 టార్గెట్‌గా బరిలోకి దిగుతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా చుట్టూనే టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్ మొత్తం అల్లుకుని ఉందిప్పుడు. చెప్పిన డేట్‌కి పక్కాగా రావాలని బుచ్చిబాబు అండ్ కో కష్టపడుతుండటంతో.. మిగితా హీరోల సినిమాలన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. పెద్ది బ్యాలెన్స్ వర్క్ అంతా రాకెట్ స్పీడ్‌లో పూర్తవుతుంది. చరణ్ దెబ్బకు ముందుగా అక్కినేని అఖిల్ తన లెనిన్ సినిమాను వాయిదా వేసుకోక తప్పలేదు. మే 1న రావాల్సిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను.. పెద్ది బాక్సాఫీస్ సునామీకి అడ్డువెళ్లడం ఎందుకని పోస్ట్‌పోన్ చేసి జూన్ 26న తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. మే 1నే వస్తానంటున్న తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం సినిమా పరిస్థితి కూడా డైలమాలోనే ఉంది. పెద్ది చెప్పిన టైమ్‌కు వస్తే మాత్రం.. తరుణ్ సినిమాకు కూడా వాయిదా తప్పదు. ఈ విషయం స్వయంగా ఆ సినిమాను విడుదల చేస్తున్న దిల్ రాజే చెప్పారు. మొత్తానికి ఒక్క పెద్ది సినిమా కారణంగా చాలా సినిమాల డేట్స్ డైలామాలో ఉన్నాయిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..

Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?

ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే

TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్

Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..

Follow Us