AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..

Prabhas: ఆ ఒక్క విషయంలో ప్రభాస్‌కు తలనొప్పులు..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 5:06 PM

Share

ప్రభాస్ ఒకేసారి ఒక సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నా, ప్రస్తుత కమిట్‌మెంట్‌ల వల్ల అది సాధ్యం కావట్లేదు. 'ఫౌజీ', 'కల్కి 2', 'స్పిరిట్' వంటి భారీ చిత్రాలను ఏకకాలంలో బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఒకేసారి మూడు విభిన్న లుక్స్, పాత్రలను పోషిస్తూ షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయడం ప్రభాస్‌కు పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితి డార్లింగ్ ప్రణాళికలను ప్రభావితం చేస్తోంది.

ప్రభాస్‌కు అన్నీ బాగానే వర్కవుట్ అవుతున్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం అస్సలు కలిసిరావట్లేదు. ఎంత బాగా ప్లాన్ చేసుకున్నా చివరి నిమిషంలో అంతా కలగాపులగం అయిపోతుంది. మరి ప్రభాస్ ప్లాన్స్‌ని అంతగా డిస్టర్బ్ చేస్తున్నదెవరు..? అసలు ఏం జరుగుతుంది..? అసలే విషయంలో ప్రభాస్ ప్లాన్ వర్కవుట్ అవ్వట్లేదు..? ఒకసారి ఒక సినిమా మాత్రమే అనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని ప్రభాస్ చాలా ట్రై చేస్తున్నారు కానీ వర్కవుట్ అవ్వట్లేదు. గతంలో సలార్, కల్కి, ఆదిపురుష్, రాజా సాబ్ సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఫౌజీతో పాటు మరో రెండు సినిమాలు మెయింటేన్ చేయక తప్పట్లేదు. ఫౌజీని దసరా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.. ఇది సెట్స్‌పై ఉండగానే ఏప్రిల్ 10 నుంచి నాగ్ అశ్విన్ కల్కి 2కు డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రభాస్ లేని సన్నివేశాలను రెండు నెలలుగా చిత్రీకరిస్తున్నారు నాగీ. కమల్, బిగ్ బి కూడా షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా వచ్చేస్తున్నారు. దాంతో పాటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సైతం లైన్‌లోనే ఉంది. ఈ మూడు భారీ బడ్జెట్ సినిమాలు దాదాపు ఒకే సమయంలో షూటింగ్ జరుపుకోనుండటంతో ప్రభాస్ డేట్స్ హాట్ టాపిక్‌గా మారాయిప్పుడు. రాత్రింబవళ్లు తేడా లేకుండా సైమంటేనియస్ షెడ్యూల్స్‌తో.. 3 డిఫరెంట్ లుక్స్, క్యారెక్టర్స్‌‌ను ఒకేసారి ఈ రేంజ్‌లో హ్యాండిల్ చేయడం ప్రభాస్‌కు ఎలా సాధ్యమవుతుందో మరి..? నిజానికి ఆదిపురుష్, సలార్, కల్కి లాంటి సినిమాలన్నీ ఒకేసారి పూర్తి చేయాల్సి వచ్చినపుడే.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అని నిర్ణయించుకున్నారు ప్రభాస్. కానీ ఆయనకున్న కమిట్‌మెంట్స్ కారణంగా కుదరట్లేదు ఈ ప్లానింగ్. అందుకే ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ ఒకేసారి బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రభాస్. వీటిలో 2026 దసరాకు ఫౌజీ.. మార్చి 5, 2027న స్పిరిట్ రానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: రాజమౌళిలో ఈ మార్పేంటి.. మహేష్ ఏం చేసారు..?

ఎన్ని గుండెలురా వీళ్లవి.! ఏకంగా పోలీసులతోనే ఫైట్‌కి దిగారు.. కట్ చేస్తే

TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్

Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..

షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..

Follow Us