Chicken Prices: చికెన్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. కేజీ ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత నెలలో పోలిస్తే భారీగా పెరుగుదల నమోదైంది. ఎండాకాలం వస్తుండటంతో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగులుతోంది. ఇవాళ ఆదివారం కావడంతో చికెన్ ధరలు పెరిగాయి. లేటెస్ట్ రేట్లు ఇలా..

నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారంతో పోలిస్తే రూ.40 నుంచి రూ.50 మేర పెరిగాయి. గత నెలలో ప్రాంతాలను బట్టి కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.250 నుంచి రూ.260 మధ్య పలకగా.. ఆదివారం నాటికి ట్రిపుల్ సెంచరీకి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.300కి చేరుకుంది. అసలే ఆదివారం కావడంతో చికెన్ తినేందుకు నాన్ వెజ్ ప్రియులు షాపుల ముందు క్యూ కడుతున్నారు. ధరలు పెరగడంతో జేబు నుంచి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇది సామాన్యులకు భారంగా మారిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
చికెన్ ధరలు ప్రాంతాల వారీగా
-హైదరాబాద్‌లో కేజీ స్కిన్ లెస్ ధర రూ.280 నుంచి రూ.300 మధ్య పలుకుతోంది. లైవ్ ఫారం కోడి ధర రూ.150, లైవ్ కోడి రిటైల్ ధర రూ.177గా ఉండగా.. విత్ స్కిన్ చికెన్ ధర రూ.257గా కొనసాగుతోంది. గత వారంలో స్కిన్ లెస్ రూ.250 నుంచి రూ.260 మధ్య లభించేది. ఇక 12 ఎగ్స్ రిటైల్ ధర రూ.66గా కొనసాగుతోంది
-విజయవాడలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.270గా ఉంది
-విశాఖపట్నలో కేజీ చికెన్ రూ.300 వద్ద కొనసాగుతోంది
-గుంటూరులో కేజీ చికెన్ రూ.250గా ఉంది
గత నెలలో తగ్గిన ధరలు
సమ్మర్ వస్తుండటంతో ఎండ వేడికి కోళ్లు చనిపోయే అవకాశముంటుంది. దీని వల్ల ఎండాకాలంలో చికెన్ ధరలు మండిపోతూ ఉంటాయి. సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో రానున్న కొద్ది నెలల పాటు చికెన్ ధరలు పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. మరో మూడు నెలల పాటు ధరల పెరుగుదల ఉండొచ్చని చెబుతున్నారు. గత నెలలో బర్డ్ ప్లూ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. అంతకముందు జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా రూ.350 వరకు పెరిగాయి.
