AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శక్తి సినిమా పోయింది అందుకే.. కుండబద్దలు కొట్టిన మెహర్ రమేష్

దర్శకుడు మెహర్ రమేష్ తన సినీ ప్రస్థానాన్ని, జూనియర్ ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని వివరించారు. పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై, పునీత్ రాజ్‌కుమార్‌తో వీర కన్నడిగతో దర్శకుడిగా మారారు. కంత్రి విజయం తర్వాత, ఎన్టీఆర్‌తో శక్తి సినిమా కథా పరిణామం, నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

శక్తి సినిమా పోయింది అందుకే.. కుండబద్దలు కొట్టిన మెహర్ రమేష్
Mehar Ramesh
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2026 | 3:51 PM

Share

దర్శకుడు మెహర్ రమేష్ తన సినీ ప్రస్థానం, జూనియర్ ఎన్టీఆర్‌తో తన అనుబంధం, ముఖ్యంగా శక్తి సినిమా నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పూరి జగన్నాథ్ వద్ద తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్, రైటర్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు మెహర్ రమేష్.  కన్నడలో పూరి జగన్నాథ్  పునీత్ రాజ్‌కుమార్‌‌తో అప్పు (ఇడియట్ రీమేక్) సినిమా తీశారు. ఆ సమయంలో పూరి.. పునీత్‌ను మెహర్ రమేశ్‌కు పరిచయం చేస్తూ దర్శకుడిగా మారే ఆఫర్ ఇచ్చారు. అప్పట్లో ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ఆంధ్రావాలా సినిమా చేస్తుండగా, అదే సినిమా కన్నడలో వీర కన్నడిగ పేరుతో పునీత్‌తో మెహర్ తీశారు.  కన్నడ భాషపై పట్టు లేకపోయినా, పూరి జగన్నాథ్ తనపై ఉంచిన నమ్మకంతో వీర కన్నడిగ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌లో భారీ విజయం సాధించింది. మెహర్ రమేష్ కెరీర్‌లో వీర కన్నడిగ చిత్రానికి ఆగస్టు 22, 2003న చిరంజీవి పుట్టినరోజున జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం ఒక మలుపు.

వీర కన్నడిగ విడుదలయ్యాక, ఎన్టీఆర్ మెహర్ రమేష్‌ను అభినందించి, మంచి కథ ఉంటే చెప్పమని ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహంతోనే మెహర్ రమేష్ తన రెండో చిత్రమైన కంత్రిని ఎన్టీఆర్‌తో తీశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిందని, అమెరికాలో యమదొంగ కంటే కంత్రి మంచి వసూళ్లు రాబట్టిందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. కంత్రి తర్వాత, జూనియర్ ఎన్టీఆర్ శక్తి కథ విని, స్వయంగా ఆ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపారు. మెహర్ రమేష్ అసలు శక్తిని 23-24 కోట్ల బడ్జెట్‌తో “మిషన్ ఇంపాజిబుల్” తరహా అసాధారణ యాక్షన్ చిత్రంగా రూపొందించాలని భావించారు. అయితే, ఎన్టీఆర్ బృందావనం సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆరు-ఏడు నెలల విరామం వచ్చింది. ఈ సమయంలో, నిర్మాత అశ్వనీదత్ శక్తి సినిమాను దేవోషనల్, సోషియో ఫాంటసీ జానర్‌గా మార్చాలని సూచించారు. అశ్వనీదత్ ఆలోచనను గౌరవించి, మెహర్ రమేష్.. జేకే భారవి, గంధం నాగరాజు, యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్ వంటి రచయితలు, స్కిప్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను భాగం చేసి కథను డెవలప్ చేశారు. మెహర్ రమేష్ కథను ఒక రకంగా ఉన్నా, నిర్మాణం మరో దిశగా సాగడం వల్ల అది “క్రాస్ జానర్” అయిందని ఆయన చెప్పుకొచ్చారు. కథ ప్రజలకు కనెక్ట్ కాకపోయినప్పటికీ, ఈ సినిమాకు పెట్టిన కృషి, ప్రొడక్షన్ వాల్యూస్, అశ్వనీదత్ పెట్టుబడి, ఎన్టీఆర్ కష్టం ఇప్పటికీ ప్రశంసనీయమని మెహర్ రమేష్ అన్నారు. కథలు నచ్చడం, నచ్చకపోవడం సాధారణమని, శక్తి విడుదల తర్వాత కూడా ఎన్టీఆర్ తన కృషిని, అంకితభావాన్ని గుర్తించారని మెహర్ రమేష్ తెలిపారు. ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు సహజమని, ఎన్టీఆర్ పరిణతి చెందిన వ్యక్తిత్వం వల్లనే ఆ బంధం కొనసాగిందని ఆయన వివరించారు.

Also Read: 20 ఎకరాల పొలం.. 200 కోట్ల ఆస్తి.. జబర్దస్త్ రిచ్చెస్ట్ కమెడియన్..!

Follow Us