రోడ్డుపై హీరోయిన్ హోర్టింగ్.. దెబ్బకు పంజాగుట్టలో 40 యాక్సిడెంట్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

31 March 2026

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్టా్ర్ అనుష్క శెట్టి గురించి తెలుగు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

ముఖ్యంగా స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ మీకు తెలుసా.. ఈ అమ్మడు పోస్టర్ కారణంగా పంజాగుట్టలో 40 యాక్సిడెంట్స్ అయ్యాయట.

ఈ విషయాన్ని డైరెక్టర్ క్రిష జాగర్లమూడి గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయన తెరకెక్కించిన వేదం సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

వేదం సినిమాలో వేశ్య పాత్రలో అనుష్క అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఊహించని రిస్క్ తీసుకుని ప్రశంసలు అందుకుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అనుష్కకు సంబంధించిన ఓ పోస్టర్ ను హైదరాబాద్ మెయిన్ రోడ్స్ పై హోర్డింగ్స్ లో పెట్టించామని చెప్పారు క్రిష్.

అయితే వాహనదారులు అనుష్క లుక్ చూస్తూ ముందున్న వెహికిల్స్ ను డాష్ ఇచ్చారని.. అలా దాదాపు 40 వరకు యాక్సిడెంట్స్ జరిగాయని చెప్పుకొచ్చారు డైరెక్టర్ క్రిష్.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే తరుచూ కేసులు నమోదు కావడంతో ఆ హోర్డింగ్స్ తీయించేశారని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి.

బహుబాలి 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీస్ తర్వాత చిత్రాలు తగ్గించిన అనుష్క.. ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది.