ఎన్టీఆర్ జిల్లాలోని కొటికలపూడిలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా కొందరు వ్యక్తులు అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఈ అసభ్య ప్రదర్శనలను అడ్డుకోకపోవడంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు. పండుగ పవిత్రతను దెబ్బతీసిన కమిటీ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.