అనకాపల్లి టౌన్ లక్ష్మీదేవిపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఏసీలో మంటలు చెలరేగడంతో రేబాక రామారావు అనే వృద్ధుడు నిద్రలోనే సజీవదహనమయ్యారు. పక్క గదిలో పడుకున్న కుటుంబ సభ్యులు పొగలను గమనించి తలుపులు తీసి వెళ్లేసరికి మంటలు గదిని చుట్టుముట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.