AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

వెలుగుపూల కెమికల్‌ పగడ.. వేట్లపాలెంను చీకటి చేసేసింది. పచ్చని గోదావరి తీరాన్ని మరో శివకాశిలా మరుభూమిగా మార్చేసింది. ఎంత ఘోరం..ఎంత విషాదం...? ఈ దారుణం వెనుక నిర్లక్ష్యం ఎవరిది? ముప్ఫై... నలభై... నలభై ఐదు... యాభై.. యాభై ఐదు... ఇవి నెంబర్లు కాదు. అన్ని అడుగుల దూరం మృతదేహాలు చెల్లాచెదురగా పడ్డాయంటే పేలుడు తీవ్రత ఎంతో అర్ధం చేసుకోవచ్చు. వేట్లపాలెం ఘటన బాధితుల్లో సామాన్యులే ఎక్కువ. రెక్కాడితే గాని బతుకు బండి నడవని అభాగ్యుల జీవితాలను బుగ్గి పాలు చేసింది ఎవరి నిర్లక్ష్యం?..

Vetlapalem Blast: ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
Andhra Pradesh cracker unit explosion
Shaik Madar Saheb
|

Updated on: Mar 01, 2026 | 8:33 AM

Share

బతుకు దెరువు కోసం పనికి వెళ్తే బాణా సంచా అమాయకులు సమిథలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెంలోని సూర్య శ్రీ ఫైర్‌ ఫ్యాక్టరీ ఎన్నో కుటుంబాల్లో చీకట్లను నింపింది. ప్రశాంతంగా ఉండే గోదావరి గుండెలపై బాంబుల మోత. ఏం జరిగిందో తెలుసుకునేలోపే సూర్యశ్రీ బాణా సంచా తయారీ కేంద్రంలో కార్మికుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. వేట్లపాలెం ఘటనలో మొత్తం 23 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సరిగ్గా మధ్యాహ్నం 2.30కు వేట్లపాలెంలో క్రాకర్‌ ఫ్యాక్టరీ పేలింది.. భారీ శబ్దాలతో చుట్టు పక్కల గ్రామాలు కూడా ఉలిక్కి పడ్డాయి. మధ్యాహ్నం 2.45 నిమిషాలు.. క్రాకర్‌ ఫ్యాక్టరీ నుంచి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలు.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం మూడున్నరకు అంబులెన్స్‌లు స్పాట్‌కు వచ్చాయి. గాయపడిపడిన వాళ్లను హాస్పిటల్‌కు తరలించారు. మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాలకు సీఎం చంద్రబాబు ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. పేలుడు ఘటనపై మాజీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాయంత్రం 4.00గంటలకు బాణాసంచా ఖార్జానా నుంచి మృతదేహాలను వెలికితీశారు. సాయంత్రం 4గంటల 40 నిమిషాలకు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో మంత్రి కందుల దుర్గేష్‌ వేట్లపాలెంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సాయంత్రం 5గంటలకు చనిపోయిన వారి వివరాలపై క్లారిటీ వచ్చింది. 13 మంది మృతదేహాలను ఐడెంటిఫై చేశారు. సాయంత్రం 6గంటలు.. ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌ వేట్లపాలెంలో ప్రమాద స్థలిని సందర్శించారు.

సాయంత్రం 6గంటల పది నిమిషాలు..వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, క్షతగాత్రులకు 50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు.. సీఎం చంద్రబాబు వేట్లపాలెంలో ప్రమాద స్థలిని పరిశీలించారు. వేట్లపాలెం ఘటనపై విచారణ జరుపుతామన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగన్నారు.మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు . దోషుల ఆస్తులు జప్తు చేసి జీవితఖైదు పడేలా చేస్తామన్నారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా వుంటుందని భరోసానిచ్చారు సీఎం చంద్రబాబు .

రాత్రి 10 గంటల 45 నిమిషాలకు.. రాజమండ్రి ఏయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

రాత్రి 11గంటల 40 నిమిషాలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..వేట్లపాలెం చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేలుడు ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు.

ఓనర్స్ అరెస్ట్

వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ ఓనర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అడ బాల అర్జున్, సోదరుడు వీరబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి ఘటన తర్వాత పరారైన యజమాని కొడుకును ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. యజమాని తండ్రి శ్రీనివాసరావు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Follow Us
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్