Andhra Pradesh: ఏపీలో వీరికి జీవితాంతం ఉచిత విద్యుత్.. నేటి నుంచే కొత్త పథకం..
ఏపీలోని చేనేతలకు గుడ్ న్యూస్. నేటి నుంచి వీరికి ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందించనుంది. చేనేతలకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి కూటమి సర్కార్ ప్రారంభించింది. దీంతో ఈ నెల నుంచి ఉచితంగా చేనేతలు విద్యుత్ పొందవచ్చు.

ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం ప్రారంభించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పథకం అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీటీడీ పొందుపర్చిన విషయం తెలిసిందే. దీంతో అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చుకునేందుకు సిద్దమైంది. ప్రతీ చేనేత కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని గతంలో కేబినెట్ ఆమోదముద్ర వేయగా.. అనంతరం పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చింది.
ప్రతీ ఏటా రూ.21,600 ఆదా
చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. దీని వల్ల రాష్ట్రంలో లక్ష చేనేత కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. ఉచిత విద్యుత్ వల్ల చేనేత కార్మికుడికి ప్రతీ ఏటా రూ.8,640, మర మగ్గాలకు రూ.21,600 ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఉచిత కరెంట్ అందించడం వల్ల వారిపై ఆర్ధిక భారం తగ్గుతుంది. ఈ పథకం వల్ల చేనేతలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వారిపై ఆర్ధిక భారం భారీగా తగ్గుతుందని మంత్రి సవిత తెలిపారు. ప్రభుత్వానికి రూ.150 కోట్ల వరకు ఖర్చు అవుతాయన్నారు. చేనేతల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, సమాజంలో వాళ్లు గౌరవప్రదంగా జీవించాలన్నారు.
త్వరలో నేతనన్న భరోసా పథకం
చేనేతల కోసం ఎన్నో పథకాలకు అమలు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. త్వరలో నేతనన్న భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చేనేతలకు ఇప్పటికే నెలకు రూ.4 వేల పింఛన్ అందిస్తున్నామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ, ఆప్కో మినహాయించాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఎగ్జిబిషన్లు నిర్వహించి చేనేత వస్త్రాల అమ్మకాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 40 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో వస్త్రాలను ప్రభుత్వం తరపున విక్రయిస్తు్న్నామని అన్నారు. ఇక ఈ వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా మినీ క్లస్టర్లు, క్టస్లరు ఏర్పాటు చేయనున్నట్లు సవిత ప్రకటించారు. ఇక ధర్మవరంలో హ్మాండ్ లూమ్ క్లస్టర్ రూ.38.30 కోట్లతో నిర్మించనున్నామని, మంగళగిరిలో హ్యాండ్ లూమ్ ప్రాజెక్ట్ వస్తుందన్నారు. ఇక పిఠాపురంలో కూడా హ్యాండ్ లూమ్ ప్రాజెక్ట్ రాబోతుందని మంత్రి సవిత పేర్కొన్నారు.
