అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ద్వారకానగర్ గ్రామ సర్పంచ్ నివాసంలో 12 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైంది. పాము బుసలు కొట్టడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రెండు గంటల పాటు శ్రమించి దానిని సురక్షితంగా పట్టుకున్నారు.