AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క చీమ ధర రూ. 21,000! సీక్రెట్‌ స్మగ్లింగ్ వెనుక అసలు కథ ఇదే.. శాస్త్రవేత్తల షాకింగ్ రిపోర్ట్ తెలిస్తే..

మనం ఇంట్లో కనిపించే చీమలను చూసి విసిగిపోతుంటాం. కానీ, అదే చీమలు స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తాయని మీకు తెలుసా? చీమల స్మగ్లింగ్ అనే వింతైన, విస్తుపోయే క్రైమ్ నెటిజన్లలో ఆసక్తినిరేపుతోంది. ఒక్కో చీమ వేల రూపాయలకు అమ్ముడవుతోందన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఒకే ఒక్క రాణి చీమ (Queen Ant) ధర అంతర్జాతీయ మార్కెట్‌లో వేల రూపాయలు పలుకుతుండటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పుడు రాణి చీమలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒక్క చీమ ధర రూ. 21,000! సీక్రెట్‌ స్మగ్లింగ్ వెనుక అసలు కథ ఇదే.. శాస్త్రవేత్తల షాకింగ్ రిపోర్ట్ తెలిస్తే..
Ant Smuggling
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2026 | 4:25 PM

Share

ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ గురించి మనం వింటుంటాం. కానీ, ఇప్పుడు స్మగ్లర్ల కన్ను చీమలపై పడింది. అవును, వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఇటీవల విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో వింతైన దృశ్యాలు కనిపించాయి. ప్యాకెట్లు, టెస్ట్ ట్యూబ్‌లు, గాజు సీసాల్లో వందల సంఖ్యలో చీమలను దాచి తరలిస్తుండగా పట్టుబడ్డాయి. రాణి చీమల అక్రమ రవాణా విపరీతంగా పెరుగుతోంది. ఒక్కో రాణి చీమ ధర మార్కెట్‌లో సుమారు 21 వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. స్మగ్లర్లు ఈ చీమలను టెస్ట్ ట్యూబ్‌లలో దాచి ఒక దేశం నుండి మరో దేశానికి తరలిస్తున్నారు. సాధారణంగా రాణి చీమలు పరిమాణంలో పెద్దవిగా ఉండి, కొత్త కాలనీలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే వీటికి ఇంత విలువ.

అసలు వీటితో ఏం చేస్తారు?:

యాంట్ కీపింగ్ హుబీ (Ant Keeping Hobby): చైనా, యూరప్, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో యాంట్ ఫార్మింగ్ ఒక విలాసవంతమైన హాబీగా మారింది. ప్రజలు తమ డ్రాయింగ్ రూమ్‌లలో గాజు పెట్టెల్లో చీమల కాలనీలను పెంచుకుంటున్నారు. ఇందుకు అరుదైన, విదేశీ రాణి చీమలు అవసరమవుతాయి.

ఇవి కూడా చదవండి

పరిశోధనలు: కొన్ని రకాల చీమల నుండి తీసే రసాయనాలు మందుల తయారీకి ఉపయోగపడతాయనే కారణంతో కూడా వీటిని అక్రమంగా తరలిస్తున్నారు.

పర్యావరణానికి ముప్పు: ఒక దేశానికి చెందిన చీమలను మరో దేశానికి తీసుకెళ్లడం వల్ల ఇన్వాసివ్ స్పీషీస్ (దురాక్రమణ జాతులు) సమస్య ఏర్పడుతుంది. ఈ విదేశీ చీమలు స్థానిక చీమలను చంపేయడమే కాకుండా, పంటలను నాశనం చేస్తాయి. అంతేకాకుండా, మనకు తెలియని కొత్త రకం వ్యాధులను ఇవి మోసుకొచ్చే అవకాశం ఉందని జీవశాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ చట్టాల ప్రకారం ఇలాంటి అక్రమ రవాణా నేరం. కేవలం సరదా కోసం ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us