AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇల్లు కొనాలనుకుంటున్నారా? టైర్-1 వర్సెస్ టైర్-2.. ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెస్ట్? 2026 రియల్ ఎస్టేట్ రిపోర్ట్!

భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. 2026 బడ్జెట్ తర్వాత టైర్-2, టైర్-3 నగరాలపై ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు (సుమారు రూ.12.2 లక్షల కోట్లు) కేటాయించడంతో, ఈ నగరాల్లో భూమి ధరలు రాబోయే 2-4 ఏళ్లలో 25శాతం నుండి 100శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇల్లు కొనాలనుకుంటున్నారా? టైర్-1 వర్సెస్ టైర్-2.. ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెస్ట్? 2026 రియల్ ఎస్టేట్ రిపోర్ట్!
Home Buying Guide
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2026 | 8:37 PM

Share

సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే, నేటి మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇల్లు కొనడం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, ఒక తెలివైన పెట్టుబడి కూడా. తాజా రియల్ ఎస్టేట్ నివేదికల ప్రకారం, 2026లో ప్రాపర్టీ మార్కెట్ ఎలా ఉండబోతుందో చెప్పే ఒక నివేధిక విశ్లేషణ ఇక్కడ ఉంది.

టైర్-1 నగరాలు: లగ్జరీకి కేరాఫ్ అడ్రస్.

ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి టైర్-1 నగరాల్లో స్థలం కొరత వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం లగ్జరీ హౌసింగ్ (రూ.1.5 కోట్లకు పైగా) విభాగంలో 40శాతం నుండి 85శాతం వరకు వృద్ధి కనిపిస్తోంది. అయితే, సామాన్యులు కొనే అఫోర్డబుల్ ఇళ్ల సరఫరా తగ్గిపోయింది. ఇక్కడ పెట్టుబడి పెడితే ఏడాదికి 4-6శాతం వరకు మాత్రమే ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది సురక్షితమైన పెట్టుబడి అయినప్పటికీ, రిటర్న్స్ నెమ్మదిగా వస్తాయి.

ఇవి కూడా చదవండి

టైర్-2 నగరాలు: భవిష్యత్తు ఆదాయ వనరులు.

వారణాసి, ఇండోర్, జైపూర్, విశాఖపట్నం వంటి నగరాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. కొత్త మెట్రో లైన్లు, ఎయిర్‌పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్ల వల్ల ఈ నగరాల ముఖచిత్రం మారుతోంది. మెట్రో నగరాల్లో వచ్చే ఒక చిన్న ఫ్లాట్ ధరతో టైర్-2 నగరాల్లో ఒక పెద్ద విల్లా లేదా విశాలమైన స్థలం పొందే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాపర్టీ ధరలు ఏడాదికి 8-12శాతం వరకు పెరుగుతాయని అంచనా.

ఇన్వెస్టర్లకు సూచనలు: 2026 బడ్జెట్‌లో ప్రభుత్వం చిన్న నగరాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో, రాబోయే ఐదేళ్లలో టైర్-2 నగరాల్లో భూమి ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మీరు సొంతంగా నివసించడానికి చూస్తుంటే సౌకర్యాలను బట్టి టైర్-1 నగరాలను ఎంచుకోవచ్చు, కానీ, కేవలం పెట్టుబడి, లాభాల కోసం అయితే టైర్-2 నగరాలను ఎంచుకోవటం బెస్ట్‌ అప్షన్‌ అంటున్నారు. ఏ నగరంలో ఇల్లు కొన్నా, అది RERA గుర్తింపు పొందిందా లేదా అని సరిచూసుకోవడం ముఖ్యం. తక్కువ వడ్డీ రేట్లు ఉన్న ప్రస్తుత సమయంలో ఇల్లు కొనడం ఒక మంచి నిర్ణయం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us