వరంగల్ జిల్లా వడ్లకొండ గ్రామంలో క్షుద్రపూజల ఘటన తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. గ్రామానికి చెందిన కవిత అనే మహిళ ఫోటో పెట్టి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. తనను చంపేందుకే తన భర్త ఈ పనులకు పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.