AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: మళ్లీ సీన్ రివర్స్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి. అయితే.. ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.. తాజాగా.. బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

Gold Rate: మళ్లీ సీన్ రివర్స్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
Gold Rates
Shaik Madar Saheb
|

Updated on: Apr 01, 2026 | 10:14 AM

Share

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పరుగులు పెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి. అయితే.. ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా లక్షా 60 వేల మార్క్ .. మళ్లీ తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే.. మళ్లీ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,970 పెరిగి.. రూ.1,51,480 కి ఎగబాకింది.

22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధరపై రూ.1,800 లు పెరిగి.. రూ.1,38,850 గా ఉంది.

వెండి కిలో ధర రూ.2,64,900 గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,850 ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,38,850 ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,51,630, 22 క్యారెట్ల ధర రూ.1,39,000 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల ధర రూ.1,38,850 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,270, 22 క్యారెట్ల ధర రూ.1,40,500 ఉంది. వెండి కిలో ధర రూ.2,65,000 లుగా ఉంది.

బెంగళూరలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,51,480, 22 క్యారెట్ల ధర రూ.1,38,850 ఉంది. వెండి కిలో ధర రూ.2,55,000 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us