AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదేం సినిమారా మామ.. ఓటీటీనే ఆగమాగం చేస్తోన్న రొమాంటిక్ మూవీ.. ఒంటరిగా చూడాల్సిందే..

ప్రస్తుతం ఓటీటీల్లో యాక్షన్ సినిమాలకంటే ఎక్కువగా రొమాంటిక్ చిత్రాలకే విపరీతంగా రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఇప్పుడు ఎలాంటి జానర్ సినిమాలను తెరకెక్కించినా అందులో రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉండేలా తమ సినిమాను పిక్చరైజ్ చేస్తున్నారు మేకర్స్. యాక్షన్ మూవీ అయినప్పటికీ కచ్చితంగా రొమాన్స్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఓటీటీనే ఆగమాగం చేస్తోంది.

OTT Movie: ఇదేం సినిమారా మామ.. ఓటీటీనే ఆగమాగం చేస్తోన్న రొమాంటిక్ మూవీ.. ఒంటరిగా చూడాల్సిందే..
Anchakkallakokkan
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2025 | 9:07 AM

Share

కొన్నాళ్లుగా మలయాళీ చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ లేకుండా చిన్న చిత్రాలుగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఏ జానర్ అయినా కంటెంట్ బలంగా ఉంటే ఆదరిస్తున్నారు ప్రేక్షకులకు. ప్రస్తుతం ఓటీటీలో ఓ మలయాళీ మూవీ గట్టిగా దూసుకుపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది ఓ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. కానీ రొమాంటిక్ సీన్లతో నెట్టింట ఆ మూవీ పేరు మారుమోగుంతుంది. అదే అంచక్కల్లకోక్కన్. డైరెక్ట్ర ఉల్లాస్ చంబన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీనే ఊపేస్తుంది. ఈ సినిమా తెలుగులో చాప్రా మర్డర్ కేస్ పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే మలయాళీ వెర్షన్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో లుక్ మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్ కీలకపాత్రలు పోషించారు. మర్డర్ కేసును పోలీసులు ఛేదించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద రూ.55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అడవిలో ఊహించని విధంగా ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. అతను ఎవరు ? అతన్ని ఎవరు చంపారు ?అనేది సినిమా.

కథ విషయానికి వస్తే..

కేరళ, కర్ణాటక సరిహద్దులో ఉండే ఓ గ్రామంలో భూస్వామి అయిన చాప్రా (శ్రీజత్ రవి) హత్యకు గురవుతాడు. అప్పుడే అక్కడికి పోలీస్ స్టేషన్ వాసుదేవన్ (లుక్మన్ అవరన్) కానిస్టేబుల్ గా రావడం.. తన హెట్ కానిస్టేబుల్ నందవరంబన్ పీటర్ (చెంబన్ వినోద్ జోస్) తో కలిసి చాప్రా హత్య కేసును ఎలా ఛేదించారనేది కథ. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. ఇంట్లో పనిచేసేవాడితో భూస్వామి భార్య ఎఫైర్ గురించి సైతం బయటకు వస్తుంది. ఆద్యంతం ఈ సినిమా ఊహించని ట్విస్టులతో ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..