Tollywood: సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇస్తోన్న ఆ స్టార్ హీరోయిన్.. ఇక రష్మిక స్పీడ్‌కు బ్రేకులు పడ్డట్టేనా.. ?
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. మూడు సినిమాలతో ఏకంగా రూ.3వేలకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్ మీదుంది. అయితే ఓ హీరోయిన్ రాక.. ఇప్పుడు రష్మిక స్పీడ్ కు బ్రేకులు వేస్తుందని ప్రచారం నడుస్తుంది.

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్రీలో ఆమె తోపు హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్ గా మారింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. అమెరికాకు చెందిన పాపులర్ సింగర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి లాస్ ఏంజిల్స్ లో నివసిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ ప్రియాంక చోప్రా. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని హాలీవుడ్ షిఫ్ట్ అయిన ప్రియాంక.. దాదాపు ఎన్నో చిత్రాలను వదులుకుంది. కొన్నాళ్లుగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తుంది.
అలాగే తాజాగా హిందీలో రాబోతున్న క్రిష్ 4లోనూ ప్రియాంక కనిపించనుందని టాక్ నడుస్తుంది. అయితే కొన్ని రోజులుగా తెలుగు, హిందీ భాషలలో వరుసగా సంచనాలు సృష్టిస్తూ రష్మిక ఫుల్ జోష్ మీదున్న సమయంలోనే ప్రియాంక చోప్రా రీఎంట్రీ ఇస్తుంది. ‘పుష్ప-2’, ‘యానిమల్’, ‘చావా’, ‘సికందర్’ వంటి చిత్రాల తర్వాత రష్మిక కెరీర్ గ్రాఫ్ వేగంగా పెరిగింది. దీంతో ఈ అమ్మడుకు హిందీలో మరిన్ని ఆఫర్స్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమంయలో ప్రియాంక చోప్రా తిరిగి రీఎంట్రీ ఇవ్వడం.. ఆమె ఒకే చెప్పిన రెండు సినిమాలు విజయం అవుతాయని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. నివేదికల ప్రకారం ప్రియాంక SSMB 29, క్రిష్ 4 చిత్రాలకు భారీగా పారితోషికం తీసుకుంది. SSMB 29 కోసం రూ.30 కోట్లు.. క్రిష్ 4 కోసం రూ.20 కోట్లు తీసుకుంటుందని టాక్.
ఇక ఇదే నిజమైతే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ప్రియాంక చోప్రా అవుతుంది. అలాగే ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక స్పీడ్ కు సైతం బ్రేకులు పడడనున్నాయని అంటున్నారు. మరీ చూడాలి ప్రియాంక హిందీలో మరిన్ని అవకాశాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? లేదా? అని.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :